మానవత్వం చాటుకున్న పిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

మానవత్వం చాటుకున్న పిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బూర్గంపహడ్, 7 ఆగస్టు 2022 తెలంగాణవార్త ప్రతినిధి :- భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో పిన్ కేర్ సభ్యులుగా ఉన్న 85 మంది మహిళా సభ్యులకు గోదావరి వరదల దృశ్య వరద ముంపుకు గురైన కారణంగా నిత్యావసర సరుకులు అందించి మేము సైతం అని మానవత్వం చాటుకున్నారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ స్వప్న చేతుల మీదుగా నిత్యవరాలను సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ హెడ్ వేంకట రత్నం, డివిజనల్ మేనేజర్ శ్రీశైలం, రీజనల్ మేనేజర్ చిన్నబ్బాయి, మేనేజర్ వెంకటేష్, సురేష్, విజయ్ కుమార్, అవినాష్, పిన్ కేర్ బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు.