మందుల సామెల్ సమక్షంలో భారీ చేరికలు

మందుల సామెల్ సమక్షంలో భారీ చేరికలు

తిరుమలగిరి 19 నవంబర్ 2023 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో శనివారం నాడు తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ సమక్షంలో వెలిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి సుమారు 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామానికి చెందిన మండల బి ఆర్ఎస్ నాయకుడు బైరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏల్లంల యాకయ్య . మాల్ రెడ్డి వేణు రెడ్డి, కుంభం సతీష్ గౌడ్. ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేస్తున్న అవినీతి అక్రమాలతో పాటు భూదందాలు ఇసుక మాఫియా ప్రశ్నించే వారి పై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తు న్నందున తుంగతుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారు అన్నారు.

  ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను తూచా తప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో అమలు చేస్తామని అన్నారు నియోజకవర్గం లో దళిత బంధు పథకంలో అవినీతి చోటుచేసుకుని ఎమ్మెల్యే అనుచరులే దళితుల పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారని ఆరోపించారు , దళితుల సొమ్ము కొంతమంది కాజేసి కోటీశ్వరులుగా మారారని ఆయన చెప్పారు బీసీ మైనార్టీ బందు లో వారికి అనుకూలంగా ఉన్న వారికే మంజూరు చేశారని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అభ్యర్థి మందుల సామేల్ తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  ఈ కార్యక్రమంలో అన్నపర్తి జ్ఞా నసుందర్ . తిరుమలగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎల్సోజ్ నరేష్ ,కార్యనిర్వాహక అధ్యక్షులు ధరావత్ జిమ్మిలాల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్ ,కందుకూరి లక్ష్మయ్య, పాలకుర్తి రాజయ్య వెను రావు, బత్తుల శ్రీనివాస్ జేరిపోతుల శోభా యాదగిరి పేరాల వీరేష్, వై నవీన్ పాలకుర్తి రాజయ్య దీప్లా నాయక్ దాచేపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలిశాల గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మామిడాల బండ్ల పెళ్లి గ్రామాల్లో జరిగిన ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు