మంత్రి హరీష్ రావు మాటలు పచ్చి అబద్ధం

మిత్రపక్ష నాయకు లు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్

జడ్పిటిసి గీ కురు రవీందర్

మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు మోసపూరిత కుట్రతో కూడుకున్నవని ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించుకోవడానికి ఎన్నికల ఎత్తుగడలో భాగంగా మాట్లాడడం జరిగిందని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ చిగురుమామిడి జడ్పిటిసి రవీందర్ అన్నారు మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని ముసుకు రాజిరెడ్డి సిపిఐ స్మారక భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ కర్ణాటకలో అద్యమనుషులను పెట్టి రైతులుగా చిత్రీకేతించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కర్ణాటకలో అమలు పరచడం జరుగుతుందని పేర్కొన్నారు.

  ఈ హుస్నాబాద్ నియోజకవర్గం లో తమ ఆధిపత్యాన్ని ఓటర్లను గురి చేయడం దీనితో ఓట్లు రాబట్టుకోవడానికి హరీష్ రావు మాట్లాడిన పన్నాగమని వీరు వెల్లడించారు గత కాంగ్రెస్ హయాంలో చెక్కుచెదరని ప్రాజెక్టులను నిర్మిస్తే టిఆర్ఎస్ హాయంలో 1,కోట్ల ప్రజాధనాన్ని ముచ్చటగా మూడు సంవత్సరాల లోపే పొంగిపోయి బుంగ పడిందని వారు విమర్శించారు వీస్తున్నది కాంగ్రెస్ గాలేనని ఈ గాలిలో టిఆర్ఎస్ కనుమరుగవుతుందని జడ్పిటిసి కి కు రవీందర్ మంద పవనన్నారు ప్రజలు 10 సంవత్సరాల పరిపాలన గుర్తించి రాష్ట్రంలో మార్పును కోరుతున్నారని చెప్పారు హుస్నాబాద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అందరికీ తెలిసేనని గౌరవెల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హాయంలో ఫౌండేషన్ స్టోన్ వేసిందని వర్ధకాలువలు అప్పుడు ప్రారంభించినవేనని చెప్పారు.

  ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను అసంతృప్తిగా వదిలేసి తమకు ఆదిలంలో ఉన్న తన అవసరాలకు వాడుకునే విధంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నారని ఇది ప్రజలను మోసం చేసినట్టు కాదా అని అన్నారు కాంగ్రెస్ అందరి మేలును కోరుకుంటుందని ప్రజా పునాదులు కాంగ్రెస్ తోనే బలపడతాయని వెల్లడించారు పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో తురకైన పాత్ర పోషించి తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదని అలాంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంత మరీ అభివృద్ధి అయితదని అన్నారు ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను కోరారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బోయిన అశోక్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు