మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినీ కలిసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినీ కలిసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

తెలంగాణ వార్త జూన్ 23 దమ్మపేట ప్రతినిధి :- అశ్వారావుపేట(నియోజకవర్గం), చండ్రుగొండ మండలం, రావికంపాడు గ్రామంలో నూతన ఆలయ నిర్మాణం కొరకు,మరియు మండలంలోని ఆలయాల అభివృద్ది గురించి, అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆలయాల అభివృద్ది కొరకు, దమ్మపేట మండలంలోని ఆలయాల అభివృద్ది దమ్మపేట పట్టణ కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ప్రభుత్వం ద్వారా అభివృద్ది మరియు ఆలయ భూముల సమస్య పరిష్కారం కొరకు,అలాగే ములకలపల్లి ,అశ్వారావుపేట మండలాల్లోని పలు ఆలయాల అభివృద్ది కొరకు ఈరోజు  అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు  హైదరాబాద్ లోనీ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసిన వినతి పత్రాలను సమర్పించారు.సానుకూలంగా స్పందించిన మంత్రి  ఆలయాల అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వారి వెంట చండ్రుగొండ మండల అధ్యక్షులు దారా బాబు,గంపెన వైస్ చైర్మన్  నలమోతు వెంకటనారాయణ,కుక్కల శ్రీను,ఇనుముల స్వామి,తదితరులు ఉన్నారు.