మృతుని కుటుంబానికి మంత్రి పరామర్శ

మృతుని కుటుంబానికి మంత్రి పరామర్శ

నాగారం, 25 ఆగష్టు 2022 తెలంగాణవార్త ప్రతినిధి :- నాగారం మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కన్నబోయిన మధు ఇటీవల ఆకస్మితంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి బుధవారం మృతుని కుటుంబాన్ని సందర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. తదనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించినారు .ఈ కార్యక్రమంలో మర్రిపెద్ధి శ్రీను, తిరుమలగిరి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అంబయ్య మండల నాయకులు కూరం వెంకన్న, చిప్పలపల్లి సోమయ్య,  ఉప సర్పంచ్ కన్నబోయిన భద్రయ్య , దేవరకొండ మురళి గద్దల సైదులు తదితరులు పాల్గొన్నారు.