మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే

మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే
మోడీ కాంగ్రెస్ ఇద్దరు స్నేహితులే

 తెలంగాణ కోసం శ్రమించిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ.

దౌల్తాబాద్  యువగలంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.

దౌల్తాబాద్, 21 నవంబర్ 2023 తెలంగాణవార్త ప్రతినిధి:- మోడీ కాంగ్రెస్ ఇద్దరూ స్నేహితులే, దొందు దొందే అని ఐటీ మంత్రి కలవకుంట తారక రామారావు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో మంగళవారం రోజున యువగలంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ముందు కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉండేవి, అంత్యక్రియలకు కూడా బ్రతిమలాడించి కరెంట్  వేయించుకునే స్థితి గత కాంగ్రెస్ పాలనలో జరిగింది. కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ తెలంగాణ అన్యాకరంతమవుతుంది చీకటి అవుతుంది. కరెంటు గురించి అవగాహన లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి. 55 సంవత్సరాలలో తెలంగాణలో ఏమి అభివృద్ధి జరగలేదు.

 ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్ని వర్గాల ప్రజలకు  సమన్యాయం జరిగిందని, రైతులు రాజులు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అని కొనియాడారు. తెలంగాణలో అన్ని వర్గాలకు సమయం చేస్తూ అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసినాము భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా చేసుకుంటామని మహిళల కష్టాలు కడ తీర్చడానికి 400 కే సిలిండర్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, గృహలక్ష్మి, వృద్ధుల పింఛన్లు ఇలా ఎన్నో రకాల సేవలు తెలంగాణ ప్రజలకు ఉన్నాయని అన్నారు. మళ్లీ మనం తెలంగాణకే కారు గుర్తుకే ఓటు వేసుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు.

 ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ  ఫారూఖ్ హుస్సేన్, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాధాకృష్ణ శర్మ, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.