బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బి బి నగర్ లెప్రసీ వాసులకు దుపట్ల పంపిణి చేసిన

 నల్గొండ ఉమ్మడి జిల్లా డి. సి. యం. యస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి

Aug 4, 2024 - 22:03
Aug 4, 2024 - 22:08
 0  29
బేతెస్థ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బి బి నగర్ లెప్రసీ వాసులకు దుపట్ల పంపిణి చేసిన

 బి.బి.నగర్ 04 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  బి. బి. నగర్ మండల కేంద్రంలోని పీర్ల గుట్ట, లెప్రసీ కాలనీలో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇక్కడ నివసిస్తున్న లెప్రసీ నిరుపేద 40 కుటుంబాలకు దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించగా. ఈ కార్యక్రమంనకు  ముఖ్య అతిధులుగా బోళ్ల వెంకట్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా డి. సి. యం. యస్ చైర్మన్ పాల్గొని వారి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో స్లాప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనియాద రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బి బి నగర్ లెప్రసీ సొసైటీ అధ్యక్షురాలు వీరముష్టి యల్లమ్మ (ఎస్తేరమ్మ ) మాట్లాడుతూ లెప్రసీ కాలనీలో సి సి రోడ్లు లేక మరియు డ్రైనేజి కాలువలు, ప్రహరీ గోడ లేక కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ ద్రుష్టి కి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  ద్రుష్టికి తీసుకెళ్లుతానని హామీ ఇచ్చారని అన్నారు.ఈ కార్యక్రమం లో బి బి నగర్ లెప్రసీ సొసైటీ ఉపాధ్యక్షులు మొర్రిగాడి నర్సింహా, సహా కార్యదర్శి వీరముష్టి ఆంజనేయులు (ఆమోస్ ), పెంటయ్య, యం. డి.అజిజ్, సోమయ్య, పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ ఏర్పుల క్రిష్టఫర్, పాల్వాయి అజయ్,కిషన్ కుమార్,చిందం వెంకటేష్ (నెహెమ్యా) తదితరులు పాల్గొన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223