బిజెపి మండల నూతన అధ్యక్షుడుగా ఇటికాల జాన్ రెడ్డి నియామకం 

Jan 9, 2025 - 19:22
 0  9
బిజెపి మండల నూతన అధ్యక్షుడుగా ఇటికాల జాన్ రెడ్డి నియామకం 

మాడుగులపల్లి 9 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- మాడుగులపల్లి మండల బిజెపి నూతన అధ్యక్షులుగా మండలంలోని చెరువుపల్లి గ్రామానికి చెందిన ఇటికాల జాన్ రెడ్డి నియమితులైనట్టు జిల్లా అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా జాన్ రెడ్డి మాట్లాడుతూ..నా ఎన్నికకు సహకరించిన గ్రామ బూత్ అధ్యక్షులు,మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.చిన్న స్థాయి కార్యకర్త నుండి ఆర్ఎస్ఎస్ ,ఏబీవీపీ,వివిధ క్షేత్రాల నుండి భారతీయ జనతా పార్టీలో రెండు సార్లు మండల ప్రధాన కార్యదర్శిగా గత 20 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉండి కష్టపడి పనిచేసినందుకు అధిష్టానం గుర్తించి అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. జిల్లా రాష్ట్ర జాతీయ అధ్యక్షుల సారధ్యంలో బిజెపి పార్టీ బలోపితం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333