బాధ్యతలు స్వీకరించిన సూర్యాపేట డి ఐ ఈ ఓ భాను నాయక్

Aug 7, 2024 - 22:29
Aug 8, 2024 - 08:01
 0  38

సూర్యాపేట8-08-2024 తెలంగాణవార్త జిల్లా ప్రతినిధి :- సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డి. ఐ. ఇ. ఓ)గ వి. భానునాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఇంటర్ విద్యా అధికారులు ప్రకటించిన డి ఐ ఈ ఓ బదిలీలలో భాను నాయక్ సూర్యాపేట జిల్లాలో సీనియర్ ప్రిన్సిపల్ కావడంతో ఆయనను నియమించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న జానపాటి కృష్ణయ్య భాను నాయక్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ పి యాదయ్య, డి పాండయ్యతో పాటు టి జి జె ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్ణాటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. వెంకటేశ్వర్లు జి. శ్రీనివాస్ జి. జె. ఎల్. ఎ అధ్యక్షుడు మద్దిమడుగు సైదులు, అధ్యాపకులు విడిఎస్ ప్రసాద్, రమేష్, వెంకన్న, శ్రీనివాసులతో పాటు మాజీ డి ఐ ఈ ఓ రుద్రంగి రవి, అధ్యాపకులు అశోక్ రెడ్డి, హేమ్లా నాయక్, నవీన్, రవి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223