బహుజన సమాజ్ పార్టీలో ప్రముఖ సినీ డైరెక్టర్ మరియు నిర్మాత చేరిక
బీఎస్పీలో టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చేరిక..
ఖమ్మం, 04 అక్టోబర్ 2022 తెలంగాణవార్త ప్రతినిధి:- బహుజన సమాజ్ పార్టీలో ప్రముఖ సినీ నిర్మాత మరియు డైరెక్టర్ మరియు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగస్తుల కార్మిక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కుంపటి భవానీ ప్రసాద్. మరియు తన అనుచరులతోబిఎస్సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భవాని ప్రసాద్ సినీ నిర్మాతగా సినీ దర్శకుడుగా ఎన్నో ప్రముఖమైనటువంటి సినిమాలు టీవీ సీరియల్ దర్శకత్వం వహించి నిర్మించారు.
అదేవిధంగా ఎందరో ప్రైవేటు ఉద్యోగస్తులకు అసంఘటితంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులను సంఘటితపరిచి వారి న్యాయమైనటువంటి సమస్యల కోసం హక్కుల కోసం టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగాఎన్నో ఉద్యమాలను నిర్మించి ప్రైవేట్ఉద్యోగుల మెప్పు పొందారు. అయినప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక పాలనకు విసుగుచెంది బహుజన రాజ్యం సాధిస్తేనే వీరందరి బతుకులు మారుతాయి అనేటువంటి ఉద్దేశంతో బీఎస్పీ పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది.
బహుజన రాజ్య స్థాపన కోసం బీఎస్పీ పార్టీలో చేరిన భవాని ప్రసాద్ ని డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు అభినందించారు. వీరితోపాటు ..అడపా ప్రవీణ్ తొర్లపాటి వెంకట కృష్ణ యాదవ్ తదితరులకు బిఎస్పీ కండువాగప్పి పార్టీలో కి ఆహ్వానించారు. బీఎస్పీ పార్టీలో చేరిన భవాని ప్రసాద్ మాట్లాడుతూ బహుజన రాజ్యం సాధించేవరకు బహుజనుల బ్రతుకులు మారేంతవరకు నేను ఈ బహుజన ఉద్యమంలో పాల్గొంటానన్నారు. బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి. పిసీ వీరస్వామి. బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ బానోతు రజిని. బీఎస్పీ జిల్లా అడ్వైజర్ మట్టి గురుమూర్తి. బీఎస్పీ జిల్లా నాయకులు చావగానే వెంకట నాగ ప్రసాద్. తిరుమలాయపాలెం మండల కన్వీనర్ ఎస్.కె చాంద్ పాషా. బీఎస్పీ నాయకులు ఆముదాల వీరబాబు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమాభినందనలతో.. బహుజన సమాజ్ పార్టీ. ఖమ్మం జిల్లా అధ్యక్షులు. డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు...