బహుజనుల కొరకు ప్రాణ త్యాగానికి సిద్ధం
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్.

బీఎస్పీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు కుట్ర
ప్రజాస్వామ్యంలో అగ్రకులాలే పోటీ చేయాలా, బహుజనులు పోటీ చేయకూడదా!
తనపై జరిగిన అత్యాయత్నాన్ని బహుజనులంతా అంతా ఖండించాలి*
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్.
సూర్యాపేట, ప్రతినిధి:- బహుజనుల కొరకు ప్రాణ త్యాగానికి సిద్ధ మని సూర్యాపేట బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామానికి ప్రచారానికి వెళ్లిన తనపై అదే గ్రామానికి చెందిన సామ తిరుమలరెడ్డి , రాజశేఖర్ రెడ్డి పథకం ప్రకారం హత్య చేయుటకు కుట్రపన్నారని బిఎస్పీ కార్యకర్తలు, గన్ మెన్ ప్రతిఘటించడంతో ప్రాణాపాయం నుంచి భగవంతుని దయవలన తప్పించుకున్నానని, తనకు రక్షణగా వచ్చిన డ్రైవర్ కు, కార్యకర్తలకు గాయాలయ్యాయని అన్నారు. ఇదంతా బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకం అని, బహుజన నాయకుడు పోటీ చేస్తే జీర్ణించుకోలేకనే ఇలాంటి దారుణానికి ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు . తనపై మంత్రి జగదీష్ రెడ్డి 70 కి పైగా కేసులు మోపిన కానీ చావు నోట్లో తలకాయ పెట్టి బహుజనుల కోసం పోటీ చేస్తున్నానని, బహుజనులు చంపుకుంటారో రక్షిస్తారో తేల్చుకోవాలని కోరారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో మోసం చేశారని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, చర్యలకు కానీ ఇలాంటి దుశ్చెర్యకు పాల్పడడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల దూకుడుకు కళ్లెం వేయాలని, బహుజన రాజ్యాధికారం బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోనే సాధ్యమని తెలిపారు.కావాలనే భూతగాదాగా అగ్రకుల నాయకులు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. అగ్రకులాల నాయకులకు ఒక రకమైన సెక్యూరిటీ బహుజనులకు ఒకరకమైన సెక్యూరిటీ ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాతర్ల పహాడ్ సర్పంచ్ మల్లయ్య యాదవ్, ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిరా, 13వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక యాదవ్, దాసరి శ్రీనివాస్, మీర్ అక్భర్, నకిరే కంటి వెంకన్న, బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు