బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి

ఆర్ డి ఆర్

బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి

పెన్ పహాడ్, నవంబర్ 20  : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు రైతులకు రైతు కూలీలకు న్యాయం జరుగుతుందని వారి ఆశలు నెరవేరుతాయి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని మహ్మదాపురం, దుబ్బ తండా, మేఘ్య తండా, ధర్మపురం, రంగయ్య గూడెం, భక్తాలపురం, మోర్సకుంట తండా నూర్జహాన్ పేట జమ్మలకుంట తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రజలకు అందించే ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు, బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి వచ్చాయని ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలుసుకోవాలని అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు, అదేవిధంగా ధర్మపురం నుండి రంగయ్య గూడెం వరకు రోడ్డు కూడా నిర్మిస్తామని అన్నారు,

  గెలిచిన తర్వాత వచ్చి రంగయ్య గూడెం గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తామని తెలిపారు, అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో కట్టించిన  60 ఏళ్లు అయినా నేటికీ గట్టిగా ఉన్న నాగార్జునసాగర్ కావాలో, బి ఆర్ ఎస్ కట్టించి కుంగిపోయిన కాలేశ్వరం కావాలో తెలుసుకోవాలని ఎన్నికల ప్రచారంలో ఆర్డిఆర్ వివరించారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్, బిజెపి, పార్టీల నుండి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పిట్ట రామ్ రెడ్డి, సంధ్యారెడ్డి, తూముల భుజంగరావు, తుమ్మల సురేష్ రావు, మాజీ ఎంపీపీలు మండల జ్యోతి పిచ్చయ్య, భూక్య పద్మ, చింత వెంకటేశ్వర్లు, గుండు వెంకన్న, తొగరు వెంకటేశ్వర్లు, కోనం వెంకన్న, నారాయణ ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు...