బిజెపిలో చేరిన ఇమాంపేట మాజీ ఎంపీటీసీ సూరసంధ్య వెంకన్న

బిజెపిలో చేరిన రామోజీ తండా వార్డు మెంబర్ బానోత్ పద్మ

బిజెపిలో చేరిన జగన్ తండా  గిరిజనులు.

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ బిజెపి: సంకినేని

 ప్రతినిధి సూర్యాపేట

బిజెపిలోకి వలసల జోరు రోజురోజుకు కొనసాగుతుంది. ప్రజల సంక్షేమ అభివృద్ధికి పాటుపడేవి బిజెపి పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇమాంపేట మాజీ ఎంపీటీసీ సూర సంధ్య వెంకన్న, ఆత్మకూరు మండలం రామోజీ తండా వార్డ్ మెంబర్ బానోత్ పద్మ ,చివ్వెంల మండలం జగన్ తండా కు చెందిన గిరిజనులు సుమారుగా 200 మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లకు రాజీనామా చేసి సూర్యాపేట నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం బిజెపి పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిరిజన యువత చదువులో రాణించాలని ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని నెలకొల్పడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నాడని అన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మాటలు నమ్మి ఓట్లు వేస్తే గిరిజనులు నష్టపోతారని ఆయన అన్నారు. అనంతరం బిజెపి కండవాలను  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంకినేని సమక్షంలో బిజేపి లో చేరికలు

 ఆదివారం సూర్యాపేట మండలం కేటీ అన్నారం మరియు ఆత్మకూర్ ఎస్ కోటి నాయక్ తండాకు చెందిన గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన వారిలో  వార్డు మెంబర్లు మస్కు అంజి, వల్లమల్ల కావేరి, కె వీరారెడ్డి, మైలవరపు శైలజ,
కోటినాయక్ తండాకు చెందిన వార్డు సభ్యులు తాటికొండ అంబారెడ్డి ,బానోతు జ్యోతి రమేష్, బానోతు బుజ్జి మదర్, బానోతు అనిత రమేష్ లు తో పాటుగా సుమారు వందమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.