ఫ్యాక్టరీ సెల్ అంటూ నాణ్యతకు తిలోదకాల

జీఎస్టీ లేకుండా వ్యాపారం నిర్వహణ  

ఫ్యాక్టరీ సెల్ అంటూ నాణ్యతకు తిలోదకాల

పట్టణ నడిబొడ్డున పట్టించుకోని అధికారులు   సూర్యా పేట;

నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ  ఫ్యాక్టరీ సెల్ అంటూ  తక్కువ ధరకు  చెప్పులు విక్రయిస్తూ  మూన్నాళ్ల ముచ్చటగా వినియోగదారులకు కుచ్చుటోపి  పెడుతున్న సంఘటన  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూడా కూడా  రోడ్డులో చోటు చేసుకుంటుంది.  కూడ కూడ రోడ్డులో నూతనంగా వెలసిన  ఫ్యాక్టరీ సెల్ అంటూ  ఎలాంటి అనుమతులు లేకుండా  వ్యాపారం నిర్వహిస్తున్న సంఘటన  వినియోగదారుల అసహనంతో  బుధవారం వెలుగులోకి వచ్చింది.. సంబంధిత దుకాణదారు  ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా  కేవలం మున్సిపాలిటీ వారి నుంచి మాత్రమే  చిన్నపాటి అనుమతి పత్రం తీసుకుని  భారీగా వ్యాపారం నిర్వహిస్తున్న  అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిలావుండగా జీఎస్టీ నంబర్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తూ  అడిగిన వారికి  ఫేక్ నెంబర్ చూపెడుతూ  దాటవేస్తోండని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.. ఇప్పటికైనా అధికారులు తగిన విచారణ చేసి  వినియోగదారులు నష్టపోకుండా చూడాలని  పలువురు వినియోగదారులు కోరుతున్నారు.