పుట్టల మల్లేష్ దక్కిన అరుదైన గౌరవ డాక్టరేట్ సామాజిక ఉద్యమ పోరుబాటలో చురుకైన పాత్ర పోషించిన పుట్టల మల్లేష్ కు అరుదైన గౌరవం

Mar 10, 2025 - 19:21
 0  125
పుట్టల మల్లేష్ దక్కిన అరుదైన గౌరవ డాక్టరేట్   సామాజిక ఉద్యమ పోరుబాటలో చురుకైన పాత్ర పోషించిన పుట్టల మల్లేష్ కు అరుదైన గౌరవం

పుట్టల మల్లేష్ కు గౌరవ డాక్టరేట్

సామాజిక ఉద్యమ పోరుబాటలో చురుకైన పాత్ర పోషించిన పుట్టల మల్లేష్ కు అరుదైన గౌరవం

 తెలంగాణ వార్త

పెన్ పహాడ్ మండలం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆబిడ్స్ లో గల సూర్య లేక కాంప్లెక్స్ నందు గాడ్సన్ హోలీ స్పిరిట్ యూ లాజికల్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎం వి ప్రసాద్ గారి అధ్యక్షతన అవార్డు ఫంక్షన్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ డాక్టర్ జివి వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ " *డే* *స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ టాక్సెస్ అమెరికా" వారిచేగౌరవ* డాక్టరేట్ స్వీకరిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సమ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు అనంతరం పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు అందులో భాగంగా" *హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్* " విభాగంలో *డాక్టర్ జి వి వెన్నెల గద్దర్ చేతుల మీదుగా గౌరవ* *డాక్టరేట్ అవార్డును* సూర్యాపేట జిల్లాకు చెందిన " **పుట్టల మల్లేష్* " కు ప్రధానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం పొట్లపహడ్ గ్రామానికి చెందిన దళిత నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టల సర్వయ్య అక్కమ్మల పుణ్యదంపతులకు ద్వితీయ కుమారుడుగా పుట్టల మల్లేష్ జన్మించాడు పొట్లపహడ్ అన్నారం(యన్) గ్రామాలలో ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం చేశారు సూర్యాపేటలో ఇంటర్మీడియట్, డిగ్రీ ,డి ఈ డి విద్యనపసించారు. తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే సంకల్పబలంతో కొంతమంది మిత్రులతో కలిసి పొట్లపహడ్ గ్రామంలో అభ్యుదయ యువజన సంఘాన్ని స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగా యువకులకు క్రీడా సామాగ్రి బహుకరించారు గ్రామీణ నేపథ్యంలో క్రీడలు స్పోర్ట్స్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2010 నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తగా పనిచేస్తూ అనంతరం 2017 సంవత్సరంలో పెన్ పహాడ్ మండల ఎమ్మార్పీఎస్అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేశారు 2023 సంవత్సరంలో సూర్యాపేట ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా చురుకుగా పనిచేశారు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎం ఎస్ పి కార్యదర్శిగా కొనసాగుతున్నారు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి హోప్ స్వచ్ఛంద సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న (సహచర మిత్రుడు)తో కలిసి పలు సామాజిక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలలో భాగంగా అనాధలకు అన్నదానం వస్త్ర దానం పండ్ల పంపిణీ ఓటర్ , ఎయిడ్స్ , పర్యావరణ పరిరక్షణ పొగాకు వ్యతిరేక దినోత్సవం మద్యపాన వ్యతిరేక దినోత్సవం మొదలగునవి అవగాహన కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు డి బి ఎస్ యు దాసరి శ్రీనివాస్ తో కలిసి సామాజిక సేవ కార్యక్రమాలలో ముఖ్య భూమిక పోషించారు అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసంఘాలతో మమేకమై సమ సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు అంబేద్కర్ బావా జలాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొన్నారు పొట్లపహడ్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పటంలో యువకులను నాయకులను, గ్రామ పెద్దలను సమన్వయపరుస్తూ ముఖ్య పాత్ర పోషించారు. వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్, అయిన ప్రవృత్తి సమాజ హితం అంబేద్కర్ బావ జలాన్ని ఆశయాలను సాధించడంలోముందుకు తీసుకు వెళ్ళటంలో ముందుంటారు పురస్కార గ్రహీత డాక్టర్ పుట్టల మల్లేష్ మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ రావడానికి సహకరించిన గాడ్ సన్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవీ ప్రసాద్ డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టాక్సెస్ అమెరికా వారికి మాదిగ కళా మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ పుట్టల మల్లేష్ గౌరవ డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా శ్రేయోభిలాషులు సామాజిక ఉద్యమకారులు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State