పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల బహిరంగ వేలం.

తెలంగాణ వార్త సూర్యపేట 6 డిసెంబర్ 2022:- వివిధ కేసులు, రోడ్డు ప్రమాదాల్లో పోలీసు స్వాధీనం చేసుకొని వాహన యజమానులు తీసుకెళ్లకుండా చాలా సంవత్సరాలుగా పోలీసు ఆధీనంలో ఉన్న ధ్వంసమైన 485 వాహనాలను రాష్ట్ర బిజెపి ఆదేశాల మేరకు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, 5 ఎస్ అమలు చేయడం లో బాగంగా బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి పెట్టడం జరిగినదని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈనెల 14వ తేదిన ఉదయం 11:00 గంటలకు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈ బహిరంగ వేళమును నిర్వహించడం జరుగుతుందని వ్యాపారులు ఎవరైనా బహిరంగ వేలం నందు పాల్గొనదలచిన వారు సంబంధిత తేదిలో జిల్లా పోలీస్ కార్యాలయం నందు జరుగుతున్న వేలంలో పాల్గొని వాహనాలను కొనుగోలు చేయవచ్చునని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపినారు. వివరాలకు జిల్లా మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఆర్ఐ శ్రీనివాస్ ని సంప్రదించవచ్చని కోరారు. జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి 93813 99631.
వేలం వేయు వాహనాలు :
ద్విచక్ర వాహనాలు - 398
ఆటోలు - 70
కార్లు, టాటా AC, స్టీరింగ్ ఆటోలు - 14
ట్రాక్టర్లు - 2
లారీ - 1
ఈ వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది, వేలం నియమ నిబంధనలు మేరకు నిర్వహించడం జరుగుతుంది. వేలం నిర్వహణను రాష్ట్ర పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది.