ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫెడరేషన్ టి పి టిఎఫ్
ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి
జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవన్లో ఆదివారం నాడు ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఉపాధ్యాయుల వృత్తి మహోన్నతమైనదన్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ప్రైవేట్ టీచర్ల సంక్షేమ భవనానికి టీచర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఆర్థిక సాయం కోసం సంక్షేమనేది చనిపోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కొరకై కృషి చేస్తామన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు ప్రతి ఉపాధ్యాయుడు తన గెలుపుకు కృషి చేయాలని అన్నారు 2014 నుండి ఈరోజు వరకు సూర్యాపేట అభివృద్ధి ఎలా ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బిఆర్ఎస్ పార్టీ విజయానికి పేట అభివృద్ధికి ప్రైవేట్ టీచర్స్ భాగ్యస్వామ్యం కావాలన్నారు సూర్యాపేటలో గత పది సంవత్సరాలుగా రౌడీయిజం గుండాయిజం లేకుండా చేసి ప్రజలకు ప్రశాంతంగా జీవించే వాతావరణం నెలకొల్పినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పేటకు రీజనల్ రింగ్ రోడ్, నెక్లెస్ రోడ్, నిర్మాణం చేస్తామని అన్నారు 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు, యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రైవేటు టీచర్ జిల్లా అధ్యక్షుడు దోసపాటి వీరు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడబోయిన సోమరాజు, పట్టణ అధ్యక్షుడు యాదసు కృష్ణ, పట్టణ కార్యదర్శి బాలకృష్ణ, జనార్ధన చారి, పట్టణ ఉపాధ్యక్షులు మహేష్ ,పట్టణ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, నాగరాజు, పూర్ణచందర్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, గండూరి ప్రకాష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ తదితరులు పాల్గొన్నారు