ప్రతి పల్లెను కదిలిస్తున్న సంపతన్న యాత్ర

ప్రతి పల్లెను కదిలిస్తున్న సంపతన్న యాత్ర
ప్రతి పల్లెను కదిలిస్తున్న సంపతన్న యాత్ర
ప్రతి పల్లెను కదిలిస్తున్న సంపతన్న యాత్ర

ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ

 అర్హులైన ఒకే ఇంట్లో అవ్వ, తాతలకు పెన్షన్

ఐజ 24 ఫిబ్రవరి 2023 తెలంగాణ వార్త ప్రతినిధి :18 వ రోజు కొనసాగుతున్న *హాత్ సే హాత్ జోడో* యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్  ఐజ మండలం రాజపురం, పులికల్ గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ  ప్రతి గడపను ప్రతి గుండెను తట్టుతు అడుగు ముందుకేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతు  ప్రతి గడపను తట్టుతూ ప్రతి వారి సమస్యలను తెలుసు కుంటూ వారి కష్టాలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది  ,రైతు రాజ్యమని,ఉత్సాహం నింపారు, బానిసలుగా బతుకుతున్న అలంపూర్ ప్రజల బతుకులు మారే రోజులు ఆసన్నమైందని ప్రజలతో  తేల్చి చెప్పారు.

  నియంత్రత్వ అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని ఇక కొద్ది రోజులు సమయం ఉందని వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని భరోసానిచ్చారు. టిఆర్ఎస్ పాలనతో విసుకు చెందిన ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.