ప్రతి ఒక్కరూ సేవా భావం దాతృ హృదయం కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ సేవా భావం దాతృ హృదయం కలిగి ఉండాలి

మునగాల 24 మార్చి 2023

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల మండల కేంద్రానికి చెందిన గాయం సత్యనారాయణ రెడ్డి సీనియర్ జర్నలిస్టు ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు గాయం వెంకట్ రెడ్డి కమలమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి మనవరాలు మల్లు అజిత ఏసి రెడ్డి దంపతులు మునగాల మండల పరిధిలో గల ముకుందపురం గ్రామ సమీపంలో ఉన్న ఇందిరా వృద్ధ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తాతయ్య నాయనమ్మ ల జ్ఞాపకార్థం ఏదో ఒక అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుతున్నది అన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథం తోటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అనాధాశ్రమాలలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారి ఆకలి తీర్చాలని వారు కోరారు. గత 25 సంవత్సరాల నుండి ఈ అనాధాశ్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ఎంతోమంది అనాధలకు ఆశ్రయం కల్పిస్తూ నీడనిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నటువంటి విజయమ్మను అభినందించారు.ఈ కార్యక్రమంలో గాయం పద్మ, ప్రణవి, జయ కీర్తన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు