పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు , తరిమెల నాగిరెడ్డి గార్ల "సంస్మరణ సభ" . 

భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్య కేంద్రం(మార్క్సిస్ట్ లెనినిస్ట్)

పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు , తరిమెల నాగిరెడ్డి గార్ల "సంస్మరణ సభ" . 
పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు , తరిమెల నాగిరెడ్డి గార్ల "సంస్మరణ సభ" . 

ఖమ్మం : నగరంలో బుధవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్య కేంద్రం   పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి గార్ల "సంస్మరణ సభ"ను నిర్వహించారు. అనంతరం వారు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి సభను ప్రారంభించారు. భారత దేశంలో విప్లవ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయని, భూస్వామ్య విధానం రద్దు, దున్నే వానికే భూమి !! సాధించడం కోసం వ్యవసాయక విప్లవం ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, భారత విప్లవోద్యమ నిర్మాతలు, యు.సి.సి.ఆర్.ఐ (యం - యల్) నాయకులు కామ్రేడ్స్ దేవులపల్లి వెంకటేశ్వర రావు, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గార్లు చూసిన జనతా ప్రజాతంత్ర విప్లవ బాటలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నాము అని అన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొని భారత విప్లమ కోసం కృషి చేయాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగ యర్రయ్య పిలుపునిచ్చారు.

  ముఖ్య అతిది విచ్చేసిన ఓ.పి.డి.ఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ డా|| జతిన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని , ఆ సమస్యల పరిష్కారం కోసం భారత పాలకవర్గాలు 76 సంత్సరాలుగా ప్రజా సమస్యలపై ప్రయత్నం చేయలేదని , ఆ సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్స్ D.V.T.N లు చూపిన తెలంగాణా రైతాంగ సాయుధ  పోరాటాల అనుభవాల ఆధారంగా భారత ప్రజలకు చూపిన ప్రజా యుద్ధ పంథా ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని . భారత ప్రజలను మోస్తున్న భూస్వామ్య,పెట్టుబడి దారీ వ్యవస్థ , బడా భూర్జువాలు వ్యతిరేకంగా  పోరాడి సాధించుకోవాలన్నారు . ప్రజలు భూముల మీద నిలబడి రాష్ట్రమంతటా జరుగుతున్న పోడు భూముల పై హక్కుల కోసం పోరాడుతున్నారు.

 ఆ పోరాటాలలో ఓ.పి.డి.ఆర్ మీకు అండదండలనిస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో "గ్రామీణ పేదల సంఘం" రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోలెబోయిన ముత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రం లోని వివిధ జిల్లాలోని గ్రామీణ , పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన ఇతర పేదలకు దున్నుకోవటానికి భూములు లేక , ఉండటానికి ఇళ్ళు , ఇళ్ళ స్థలాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని , వీరి యొక్క మౌలిక సమస్యల పరిష్కారానికై పాలక వర్గాలు భూ సంస్కరణలు , సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయిందని . పేదల సమస్యల పరిష్కారానికై భూస్వామ్య విధానం రద్దు, దున్నే వానికే భూమిని సాధించే వ్యవసాయ విప్లవ కార్యక్రమం అమలు జరిపిన నాడే మౌలిక మార్పు వస్తుందని, దీనికి సిద్ధపడాలని వారు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమానికి కామ్రేడ్ కల్తి ఎర్రబాబు , యు.సి.సి.ఆర్.ఐ - (యం - యల్ ) అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో  య.సి.సి..ఆర్.ఐ ( ఎం.ఎల్ ) సీనియర్ నాయకులు దండా లింగయ్య, కామ్రేడ్ సురేందర్, గ్రామీణ పేదల సంఘం జిల్లా కన్వీనర్ కల్తీ రామచంద్రయ్య , ఓ.పీ.డీ.ఆర్ ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి, ప్రజాతంత్ర విద్యార్ధి సంస్థ( DSO)రాష్ట్ర కార్యదర్శి కల్తీ లెనిన్ , గ్రామీణ పేదల సంఘం ఖమ్మం నగర కార్యదర్శి రాళ్లబండి నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు . మరియు నవోదయ కళాకారులచే విప్లవ గీతాలు,నాటికలు,పల్లె సుద్దులు నిర్వహించారు. ప్రజల అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ "సంస్మరణ సభ"ను విజయవంతం చేశారు