దళిత ఆత్మబంధువు కేసీఆర్ 

తల్లమల్ల హసేన్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది 

దళిత ఆత్మబంధువు కేసీఆర్ 
దళిత ఆత్మబంధువు కేసీఆర్ 
దళిత ఆత్మబంధువు కేసీఆర్ 

సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

తల్లమల్ల హసేన్

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది 

వందలాది సంవత్సరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అణిచివేయబడ్డ దళితుల వెనకాల బాటు తనాన్ని తొలగించాలని ఎంతో మేధో మధనం తో ఆలోచించి దళితుల ఆర్థిక స్వాలంబనకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన దళితుల ఆత్మబంధువు కేసీఆర్ అని సీనియర్ న్యాయవాది దళిత నాయకులు తల్లమల్ల అన్నారు. ఈరోజు ఉదయం ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు తుమ్మల పెన్ పహాడ్ కోటపహాడ్ గ్రామాలలో, పెన్ పహాడ్ మండలంలో అనంతారం పట్లపహాడ్ నాగుల పహాడ్  మొదలగు గ్రామాలలోని దళిత వాడలలో  దళిత న్యాయవాదులు, దళిత నాయకులు పర్యటించారు. ఆయా గ్రామాలలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది  తల్లమల్ల హసేన్, బిఆర్ఎస్ న్యాయవిభాగం నాయకులు జిలకర చంద్రమౌళి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల అభివృద్ధి సంక్షేమం గురించి దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని, ఈ పథకం మహాద్భుతమైన పథకమని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో దళిత విద్యార్థులను ఉన్నత శ్రేణి విద్యావేత్తలుగా తయారు చేయుటకు అనేకమైన గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారని,  ఆ గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ డాక్టర్లుగా, న్యాయవాదులుగా, ఇంజనీర్లుగా, విదేశీ విద్యను కూడా అభ్యసిస్తూ సమాజాభివృద్ధికి తోడుపడుతున్నారని అన్నారు.

నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని నామకరణం చేయటం, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ దేశంలో ఎప్పటి వరకు ఎక్కడ జరగలేదని, మన రాష్ట్రంలో మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  ఏర్పాటు చేశారని అన్నారు. విదేశాలలో చదువుకునే దళిత విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను గత ప్రభుత్వంలో ఇచ్చిన 10 లక్షల రూపాయలను,తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇస్తూ ఎంతో మంది దళిత విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించుటకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

దళిత బంధు పథకం ప్రతి ఆర్థిక సంవత్సరం నుండి దళితులకు అందజేస్తారని ఇలాంటి అనుమానాలకు తా వులేదని, ఇది  ముఖ్యమంత్రి కేసీఆర్  దళిత ఆత్మబంధువుగా ప్రవేశపెట్టిన దళిత బందు పతకం కొనసాగుతుందని అన్నారు. దళితులందరూ బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి,ఈనెల 30వ తారీఖు నాడు జరుగు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  మంత్రి  జగదీశ్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరినారు.

  ఎస్సీ దళితవాడల లో సందర్శించి  న  ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీ దళిత న్యాయవాదులు తల్లమల్ల హసేన్, జిలకర చంద్రమౌళి, అనుములపూరి సైదులు, చిప్పలపల్లి చిరంజీవి, మీసాల శ్రీనివాస్, దళిత నాయకులు గోలి సాంబయ్య, దాసరి దేవయ్య, గాజుల నరసయ్య, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.