దొరలు,పెతందారులు ఆకృత చర్యలకు పాల్పడితే రాజకీయ సమాధి కడతాం

దొరలు,పెతందారులు ఆకృత చర్యలకు పాల్పడితే రాజకీయ సమాధి కడతాం

బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు భీమయ్యగౌడ్.

 సూర్యాపేట:- దొరలు,పెతందారులు ఆకృత చర్యలకు పాల్పడితే రాజకీయ సమాధి కడతామని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు భీమయ్యగౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,ఆదివారం ఆత్మకూరుఏస్,మండలం గటికల్లు గ్రామంలో బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి బంధువులు దాడికి పాల్పడం హేయమైన చర్య అన్నారు. బహుజన రాజ్యం ఏర్పాటు కోసం ఒక బీసీ బిడ్డ పోరాడుతుంటే ప్రజలలో బీఎస్పీ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని,డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల కోసం రాజ్యాధికారం కోసం పోరాడుతుంటే,ఇలాంటి అరాచకాలకు పాల్పడవుతున్నారని,మీకు త్వరలోనే ఓటు ద్వారా బుద్ధి చెప్తామని తెలిపారు.

ఆత్మకూర్ ఎస్ మండల ఎస్సై గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఆలస్యంగా వచ్చి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయకుండా వాళ్ళని  భుజగించే పని చేశారని అన్నారు. బహుజనులపై దాడి చేస్తే ఇకపై సహించేది లేదని దానికి మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శ్రీనివాస్, ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిర, ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నకిరేకంటి వెంకన్న, పట్టణ అధ్యక్షులు గట్టు గోపి, ఉపేందర్,కళ్యాణి, లలిత, నాగయ్య, శోభా భాయ్, నవీన్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.