దామోదర్ రెడ్డి కి ఓటేస్తే గ్రామాల్లో సమాదులే మిగలాయి
ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి...

తెలంగాణవార్త ఆత్మకూర్ ఎస్ ప్రతినిధి:- దామోదర్ రెడ్డి కి ఓటేస్తే హత్యా రాజకీయాలు, గ్రామాల్లో సమాదులే మిగిలాయనీ విద్యుత్ శాఖ మంత్రి బీ ఆర్ ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని బొట్యా తండా, తుమ్మల పెన్పాడు, కోటపాడు, శెట్టి గూడెం, అస్లాతండ, గ్రామంలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు. దామోదర్ రెడ్డి గెలిచిన ప్రతిసారి తుంగతుర్తి లోనే కాకుండా సూర్యాపేటలో కూడా గుండాయిజం రౌడీయిజం వెచ్చరిల్లిపోయి సామాన్యుడు జీవించే పరిస్థితి లేదని అన్నారు. పట్టణంలో చిన్న వ్యాపార సైతం దామోదర్ రెడ్డి అనుచరుల దాదాగిరికి బలయ్యారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారులకు వచ్చినట్లయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అవి తొలి తొలి చేసి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తుడి నరసింహారావు, కొనతం సత్యనారాయణ రెడ్డి, లింగా నాయక్ శేఖర్ రెడ్డి, పానుగంటి లలిత, కాన్య,నర్సిరెడ్డి, కానుగ శ్రీనివాస్, ఇంద్రారెడ్డి, ఏడుకొండలు, బెల్లంకొండ ఎల్లయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.