దాడులకు పాల్పడితే సహించేది లేదు

దాడులకు పాల్పడితే సహించేది లేదు

తెలంగాణ వార్త ఆత్మకూరుయస్ ప్రతినిధి దాడులకు పాల్పడితే సహించేది లేదు
ఆత్మకూర్ ఎస్..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆగ్రకులాలనేతలు బహుజనుల పై ఆకృత చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదనీ బీ ఎస్ పి జిల్లా నాయకులు కేషబోయిన మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.సోమవారం మండల పరిధిలోని నెమ్మికల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,ఆదివారం ఆత్మకూరు ఏస్,మండలం గటికల్లు గ్రామంలో బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి బంధువులు దాడికి పాల్పడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను రాత్రి మంత్రి క్యాంప్ కార్యాలయంలో షెల్టర్ ఇవ్వడం ఎంత వరకు సమంజమని అన్నారు బహుజన రాజ్యం ఏర్పాటు కోసం ఒక బీసీ బిడ్డ వట్టే జానయ్య పోరాడుతుంటే ప్రజలలో బీఎస్పీ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని,ఇలాంటి అరాచకాలకు పాల్పడవుతున్నారని,మీకు త్వరలోనే ఓటు ద్వారా బుద్ధి చెప్తామని తెలిపారు.  బహుజనులపై దాడి చేస్తే ఇకపై సహించేది లేదని దానికి మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో బోల్లే సైదులు, భారీ అశోక్, ఎంపిటిసి మల్లయ్య, చంద్రయ్య, రామనర్సు, కర్ణకర్ , మహేష్,ఎంపీటీసీ చెరుకు ఇందిర, తదితరులు పాల్గొన్నారు.