తీవ్ర అస్వస్థతకు గురైన కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక

బిగ్ బ్రేకింగ్ న్యూస్..

తీవ్ర అస్వస్థతకు గురైన కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక

చెన్నై:- నిన్నటి నుండి తీవ్ర జ్వరంతో పాటుగా కమల్ హాసన్ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి హుటాహుటిన ఆయనను రామచంద్ర ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని, అందుకే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు భావిస్తున్నారు. కమల్ హాసన్ త్వరగా కోలుకుని ఇంటికి రావలి అని కమల్ హాసన్ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు..