తెలంగాణ లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే...యన్ పద్మావతి రెడ్డి..

తెలంగాణ లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే...యన్ పద్మావతి రెడ్డి..

మునగాల 21 నవంబర్ 2023

తెలంగాణ వార్త ప్రతినిధి :-

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి యన్ పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.మునగాల మండల పరిధిలోని మాధవరం, ఈదులవాగు తండా నేలమర్రి వెంకట్రామపురం తాడ్వాయి విజయరాఘవాపుం,రేపాల, సీతానగరం, నర్సింహులగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.రాష్టంలో జరగబోయే ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి అధికారంలోకి రావాడం ఖాయమని అన్నారు.గత తొమ్మిది సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదాని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు స్వార్ధ రాజకీయల కోసం కూలాల మధ్య చిచ్చు రేపిన అల్లకల్లోలం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తంచేశారు.కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ నాయకులు పందిరి నాగిరెడ్డి, స్ధానిక ఎంపిపి యలక బిందు ‌నరేందర్ రెడ్డి, తాడ్వాయి సొసైటీ మాజీ చైర్మన్ గరిణే కోటేశ్వరరావు,తమ్మర కౌన్సిలర్ సామీనేని ప్రమీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ కొప్పుల జైపాల్ రెడ్డి, వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య, పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకి రెడ్డి, యూత్ అధ్యక్షుడు జిల్లేపల్లి శ్రీనివాస్,అయ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.