తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మద్దతు బిఆర్ఎస్ పార్టీకే

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మద్దతు బిఆర్ఎస్ పార్టీకే

అభివృద్ధి చేసే నాయకులను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలి

సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ

మాలలంతా బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి : తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్

 ప్రతినిధి సూర్యాపేట

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమే నని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు చెరుకు రామచందర్ అన్నారు*. ఆదివారం జిల్లా కేంద్రలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సూర్యాపేట అభ్యర్థి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మాల సంఘాల జేఏసీ మద్దతు ప్రకటించి మాట్లాడారు.  హైదరాబాదులో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైంది అన్నారు.* దళితులను ఆర్థికంగా సామాజికంగా ఆదుకునేందుకు దళిత బంధు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. పెన్షన్లతో పాటు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి కెసిఆర్ కిట్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు నేడు ప్రజలందరికీ చేరువయ్యాయన్నారు.మాలల సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల్లో 10 కోట్లతో,  హైదరాబాదులో ఐదు ఎకరాల్లో 20 కోట్లతో మాలభవనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే భాగ్యరెడ్డి వర్మ విగ్రహ ఏర్పాటుతో పాటు ఎస్సీల వార్షిక ఆదాయాన్ని రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. మాలలకు రాజకీయంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు కల్పించడంతో పాటు రాజకీయపరంగా రావాల్సిన రిజర్వేషన్ను ఇవ్వనున్నట్లు వివరించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మాలలంతా ఐక్యమై టిఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలంత ఏకమై అభివృద్ధి చేసే మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించి మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్లు తాళ్లపల్లి రవి,  మేక వెంకన్న,  గుడిమల్ల వినోద్,  మంత్రి నర్సింహయ్య, కో చైర్మన్లు గడ్డం సత్యనారాయణ,  వైస్ చైర్మన్ తాలూకా అనిల్,  ఎంబే వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు వినయ్,  పట్టణ అధ్యక్షులు బొల్లేద్దు మహేందర్,  పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దూరి కుమార్,  నాయకులు విక్రం,  బైండ్ల శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు.