తిరుమలగిరి మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తిరుమలగిరి మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తిరుమలగిరి 17 నవంబర్ 2023 తెలంగాణ వార్త రిపోర్టర్

మూల అశోక్ రెడ్డి నాయకత్వంలో భారీగా చేరికలు

తిరుమలగిరి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గతంలో జలాల్పురం, మామిడాల, రాఘవపురం ,తిరుమలగిరి మున్సిపల్ తో పాటు పలు ప్రాంతాల నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తిరుమలగిరి మండలంలో బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కాగా తాజాగా గురువారం తిరుమలగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రైతుబంధు మండల కోఆర్డినేటర్ మూల అశోక్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ సభ్యులు బి ఆర్ ఎస్ తిరుమలగిరి మండల ఉపాధ్యక్షులు కందుకూరు లక్ష్మయ్య తో పాటు 200 మంది నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ రాగానే అభిమానంతో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమంది స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏల్సోజు నరేష్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంబేద్కర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు పేరాల వీరేష్, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎండి ఆఫీజ్, వై. నవీన్, మూల రవీందర్ రెడ్డి, ఎం జితేందర్ , దాచేపల్లి వెంకన్న ,ఎండి కలీం తదితరులు పాల్గొన్నారు..