తిరుమలగిరిలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల రాజీనామా

తిరుమలగిరి 17 నవంబర్ 2023 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలో. ఉద్యమ నాయకుడు గత టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు దుంపల కృష్ణారెడ్డి. రఘునందన్ ఎర్రగొల్ల లింగయ్య కొత్తగట్టు యాకయ్య కొండ నరేష్ కొండ రమేష్ వీరనారి ఏపూరి నరేష్ సుమారు 50 మంది రాజీనామా చెయ్యడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారులు దుంపల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తిరుమలగిరి పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మన ప్రాంత వాసి మన స్థానికుడైనటువంటి ఉద్యమ నాయకుడు అయిన మందుల సామేలు కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆయనే టిఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీ కోసం రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా అతన్ని స్థానికుడైన నాయకున్ని గుర్తించకుండా ఎటువంటి ఫ్లెక్సీలోనైనా అతని ఫోటో లేకుండా ఎటువంటి కార్యక్రమానికి కూడా అతన్ని ఆహ్వానించకుండా అవమానించారు వీటన్నింటిని మన ప్రాంత ప్రజలు గుర్తుంచుకొని ఈరోజు సామెల్ కు అండగా నిలబడి వారిని గెలిపించడానికి తీర్మానించుకొని మలిదశ ఉద్యమకారుల అందరం రాజీనామా చేసాం ఇలాగే ఒక తిరుమలగిరి కాకుండా మొత్తం తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు సామేలు కు మద్దతుగా నిలబడి అతని గెలుపు కోసం ప్రయత్నాలు చేసి స్థానికుడైన మన నాయకుడిని గెలిపించుకోవడానికి కృషి చేయాలి పరాయి ప్రాంతం వారి పాలన పోవాలి స్థానిక నాయకుడు అయినటువంటి మన సామెల్ రావాలి తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేల్ సమక్షంలో..కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాం అని తెలిపారు