జిల్లాలోని వికలాంగులకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ
జిల్లా లోని వికలాంగుల కు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ అద్వర్యం లో వీల్ చైర్స్ పంపిణి
సూర్యాపేట జిల్లా 8-08-2024 తెలంగాణ వార్తా ప్రతినిధి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా లోని క్రిపుల్డ్ దివ్యాంగులకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ అద్వర్యం లో బ్రింగ్ ఎ స్మైల్ ఫౌండేషన్ సహాయం తో 28 వీల్ చైర్స్ పంపిణి చేయటం జరిగినది . జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవర్ , తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ ముఖ్య అతిధి గా హాజరు అయి పాల్గొన్నారు. ఈ సందర్బగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఉన్న సమస్య లను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుంది అని అన్నారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ ,అర్చన సురేష్ మాట్లాడుతూ దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించటం మరియు రాబోయే రోజులో కూడా వారికీ సహాయం గా వుంటాము అని అన్నారు. దివ్యాంగులు వీల్ చైర్స్ లేక నడవ లేని స్థితిలో ఉన్న వారికీ చాలా సహాయం గా ఉపయోగపడే వీల్ చైర్స్ ని అందించటం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవర్ , T-SIG డైరెక్టర్ అర్చన సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి కే.నరసింహ రావు,A.O సుదర్శన్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.