జగన్ నియంత విధానాలను విడనాడాలి

జగన్ నియంత విధానాలను విడనాడాలి
జగన్ నియంత విధానాలను విడనాడాలి
జగన్ నియంత విధానాలను విడనాడాలి
జగన్ నియంత విధానాలను విడనాడాలి

చంద్రబాబు విడుదల కోసం టీడీపీ దొండపాడులో దీక్ష

మండవ వెంకటేశ్వర్లు గౌడ్ టిడిపి నల్లగొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి,

హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్

( దొండపాడు గ్రామం ) చింతలపాలెం మండలం

చింతలపాలెం, 03 అక్టోబర్ 2023 తెలంగాణవార్త విలేఖరి:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నియంత విధానాలను మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ సూచించారు. మంగళవారం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో చేపట్టిన నిరాహార దీక్ష లో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపులో భాగంగా అక్రమ అరెస్టు చేయించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును అరెస్టు చేయిస్తే తనకు అడ్డు ఉండదనే నెపంతో కుట్రచేస్తున్నాడన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని జగన్ రౌడీ ఇజం నియంత విధానాలు ఎల్లా కాలం పని చేయవనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

  చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేయించి తెలుగు ప్రజల దృష్టిలో జగన్ దోషిగా ఉన్నాడని అన్నారు. జగన్ చర్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర వాదులు ఏకం కావాలని, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

  ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పంటచిన కోటిరెడ్డి, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి,చింతలపాలెం మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేకల రామారావు యాదవ్, పుట్టా నరసింహారావు చౌదరి, దొండపాడు గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టా పుల్లయ్య చౌదరి,  సీనియర్ పార్టీ నాయకులు పల్నేటి రాంబాబు చౌదరి, సీనియర్ పార్టీ నాయకులు మంద మట్టయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు చిట్టెం శెట్టి నాగేశ్వరరావు, రెబ్బ వెంకటేశ్వర్లు ,అన్నపురెడ్డి సుబ్బారెడ్డి ,దొంగల శ్రీను ,తెలుగు యువత పార్లమెంటు నాయకులు బానోతు వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి బొంత రాజు ,చల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు