చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన. వేమూరి....

.మునగాల 21 నవంబర్ 2023
తెలంగాణ వార్త ప్రతినిధి :-
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించారని ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేసి 370 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేసి 22 నెలలతర్వాత ఆయనను నిందితుడిగా చేర్చి రిమాండ్ విధించి 53 రోజులు. జైల్లో ఉంచి రాజకీయంగా లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సందర్భం నుంచి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతునిస్తూ. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయరని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎన్నో నిరసన దీక్షలు పూజలు ప్రార్థనలు చేశారని ప్రజలందరి దీవెనలతో భగవంతుడి ఆశీస్సులతో ఏపీ హైకోర్టు సిఐడి అధికారులు. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని నేటికీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సేకరించలేకపోయిందని నిధులు దుర్వినియోగం అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెదేపా ఖాతాలోకి నిధులు చేరాయినందుకు. ఎలాంటి స్పష్టమైన ఆధారాలు సిఐడి వద్ద లేవని భావించి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.