గులాబీమయమైన సూర్యాపేట జిల్లా కేంద్రం

సభలో సూర్యాపేటకు వరాల జల్లు కురిపించిన కె సి ఆర్.
1 / 8

1. సభలో సూర్యాపేటకు వరాల జల్లు కురిపించిన కె సి ఆర్.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో  నిర్వహించిన సీఎం కేసీఆర్‌  ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రాగా, అత్యధికంగా జిల్లా కేంద్రంగా ఉన్న సూర్యాపేట నియోజక వర్గం నుండే తరలి వచ్చారు. అడుగడుగునా పుష్పాలతో  స్వాగతం పలికిన పట్టణ ప్రజల అభిమానానికి కేసీఆర్‌  ముగ్ధులయ్యారు. సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 4 మున్సిపాలిటీ (కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల )లకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

Next