గ్రామ శాఖ యూత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పై అవగాహన

గ్రామ శాఖ యూత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పై అవగాహన

తిరుమలగిరి 18 నవంబర్ 2023 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు సజన్ కుమార్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది తుంగతుర్తి నియోజకవర్గం లో మందుల సామెల్ గెలుపు ఖాయం ఎవరు ఆపలేరు స్థానికుడు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అత్యధిక మెజార్టీ పై గెలిపించాలని కార్యకర్తలను ప్రజలను కోరారు మరియు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆరు గ్యారెంటీ లపై మరియు జూడో యాప్ పై అవగాహన కల్పించారు అలాగే ప్రజలకు 6 గ్యారెంటీ లపై అవగాహన చేపట్టాలని కోరారు అనంతరం  గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు ముక్కెర మహేష్ మరియు వెంకన్న కార్యకర్తలు వారికి సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగులగాని వెంకన్న సందీప్ ప్రశాంత్ పవన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు