గొడ్డళ్లు, కత్తులతో వట్టే జానయ్య యాదవ్ పై దాడి

తృటిలో తప్పిన ప్రమాదం.

బి ఎస్ పి కార్యకర్తకు తీవ్ర గాయాలు.

మంత్రి బందువే గొడవకు కారణం. బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆరోపణ.

గట్టికల్  గ్రామంలో ఉద్రుక్తత వాతావరణం.

సూర్యాపేట నియోజకవర్గం.

ఆత్మకూరు / గట్టికల్లు 19 నవంబర్ 2023 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో  ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి (సుమారు ఏడు గంటల సమయంలో) బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు. ప్రత్యర్థులు (బిఆర్ఎస్ నాయకులు) జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసిన సంఘటన లో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడు కి తీవ్ర గాయాలయ్యాయి.  దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉదృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

దాడి చేసిన వారిపై వట్టే జానయ్య యాదవ్ ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదు. అని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

పోలీసుల పనితీరుకు బిఎస్పి పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.