గంజాయి పట్టివేత..

గంజాయి పట్టివేత..

చివ్వేంల :- మండల పరిధిలోని కుడకుడ మూసి కెనాల్ వద్ద ఎస్సై విష్ణు  మూర్తి సిబ్బంది  వాహనాల తనిఖీ చేస్తుండగా గంజాయిని పట్టుకున్నట్టు తెలిపారు. ఎస్సై విష్ణుమూర్తి తెలిపిన ప్రకారం  సోమవారం ఎన్నికల్లో భాగంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  వాహనాలు తనిఖీ చేస్తుండగా    కుడకుడ  వైపు నుండి TS-29F-3589 నంబర్ గల స్కూటర్ పై ముగ్గురు వ్యక్తులు వస్తూ పోలీస్ వారిని చూసి కొద్ది దూరములో ఆపగా స్కూటర్ వెనుక కూర్చున్న తరుణ్ స్కూటర్ దిగి పారిపోగా  మిగిలిన ఇద్దరు   1) కంచుగొమ్ముల శివ @ చింటు తండ్రి వీరయ్య వ. 19 సం.లు. కులం:  యాదవ్, వృత్తి : సెంట్రింగ్ వర్క్ గ్రామం: వీరన్న గుడి దగ్గర  కుడకుడ 2) గాదె టోని @ అనూప్ నంద్ తండ్రి దేవానంద్, వయసు: 20 సం.లు, కులము: మాల, వృత్తి: విద్యార్ధి, నివాసము: చర్చ్ దగ్గర, కుడకుడ,  అని తెలిపి వారు మరియు వారి స్నేహితుడు అయిన సూర్యాపేట తాళ్ళగడ్డ కు చెందిన గట్టు తరుణ్ లు గంజాయి త్రాగుటకు అలవాటు పడి, మున్యా నాయక్ తండా కు చెందిన మహేశ్ అనే అతని ద్వారా పెన్ పహాడ్ మండలంకు చెందిన దినేష్ అనే అతని వద్ద గంజాయి ప్యాకెట్ 25 గ్రాముల గలదానిని రూ.500/- ల చొప్పున కొనుగోలు చేసి కుడ కుడ శివారులలో త్రాగుచుండేవారు  మరియు గంజాయి తాగే ఇతరులకు అమ్ముతుండేవారు . అదే విధంగా ముగ్గురు 20 ప్యాకెట్లు కొనుగోలు చేసి రెండు ప్యాకేట్లు తాగి, మిగతా వాటిని ముగ్గురు కలిసి అమ్ముటకు తీసుకెళుచుండగా పట్టుకొని   తహశీల్దార్ రంగారావు  పంచనామా చేసినట్లు తెలిపారు.  నేరస్తులనుండి మొత్తం 400 గ్రాముల గంజాయి,  రెండు సెల్ ఫోన్లు మరియు ఒక స్కూటర్ ను స్వాదీన పర్చుకొనట్లు తెలియజేసారు . ముగ్గురు నేరస్తులు తరుణ్, దినేష్ మరియు మహేశ్ లు పరారీలో ఉన్నారు. వారిని , సర్కిల్ ఇన్స్ పెక్టర్ అశోక్ రెడ్డి  నేరస్తులను అరెస్ట్  చేసి కోర్టుకు పంపినట్లు తెలిపారు.