కాంగ్రెస్ లఫంగి మాటలు నమ్మొద్దు

దళితులందరికి దళితబంధు ఇస్తాం
-మూడవ సారి రసమయి హ్యాట్రిక్ కొడతాడు
ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
-ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
-అటుకులు బుక్కీ..గంజినీళ్లు తాగి తెలంగాణ కోసం కొట్లాడినం
-హుజురాబాద్ మాదిరిగా మానకొండూర్ నియోజకవర్గములో దలితులకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రతి కుటుంబానికి ₹10లక్షలు
-కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలే
-ప్రజలందరూ రసమయి బాలకిషన్ ను ఆశీర్వదించండి
-కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీ లు పెట్టిన...ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారు
-కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయి
మానకొండూర్ నియోజకవర్గంలోని దళితలందరికి హుజురాబాద్ తరహాలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి₹10లక్షల సాయం అందిస్తామని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు సర్వేలు చేయించడం జరిగిందని, భారీ మెజారిటీతో మూడవ సారి కూడా ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ గారు గెలువబోతున్నారని పేర్కొన్నారు.
పొద్దుగాలనే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారిని ఆశీర్వదించదానికి వేలాది సంఖ్యలో తరలివచ్చిన జనాన్ని చూస్తేనే రసమయి గెలుపు ఖాయమైందని అన్నారు.
కాంగ్రెస్ లపంగి మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని...కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బ్రతుకులు అందకారమవుతాయని.. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు చూశామని...మళ్లీ అధికారం ఇస్తే ప్రజల నోట్లో మట్టికొడతారని అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని...ఇగ తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కనీసం 5గంటల కరెంటు ఇవ్వడం లేదని...తెలంగాణ లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ₹10వేలు ఇస్తున్నామని, మళ్లీ ఎన్నికలు అయ్యాకనే పెట్టుబడి సాయం₹16వేలు ఇస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని...సంబద పెంచుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
అరవై ఏండ్లు పాలించి అప్పుడు ఏం చేయలేదని..ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పెట్టుకుని ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటల కరెంటు ఇస్తారని...రైతుల బ్రతుకులు మళ్లీ అంధకారం అవుతాయని...ప్రజలందరూ ఆలోచించి కారు గుర్తుకు ఓటెయ్యాలని అన్నారు.
అటుకులు బుక్కి.. గంజినీళ్లు తాగి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించాలని అన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ దొంగలు చేతిలో పెడితే ప్రజలను ఆగం చేస్తారని అన్నారు.
ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు.
ఆటోలకు ఫిట్ నెస్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.