కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసులు

కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసులు
కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసులు
కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసులు

గ్రామాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమి లేదు

ప్రజల కోసం పనిచేసిన చరిత్ర కాంగ్రెస్  కు లేదు

ఊర్లలో కొట్లాటలు.. సూర్యాపేటలో దందాలే కాంగ్రెస్ నైజం

మనం వేసే ఓటే మన తలరాతను మారుస్తుంది

ఎవరికి వేసిన ఓటుతో ఏమొచ్చిందో ఆలోచన చేయాలి

2009లో వేసిన ఓటు  ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వలే

2014లో వేసిన ఓటు కడుపునిండా కరెంటు ఇస్తుంది

కళ్ళ ముందున్న అభివృద్ధి చూసి ఆశీర్వదించండి

యువతకు ఉపాధి లక్ష్యంగా భవిష్యత్తు పాలన

దేశం ఆశ్చర్యపోయేలా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా

బిఆర్ఎస్ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు

 సూర్యాపేట లొ గుబాళిస్తున్న గులాబీప్రచారం

ఊరూరా కలియతిరుగుతున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట రూరల్ మండలం కేసారం, కాసరబాద, తాళ్ల ఖమ్మం పహాడ్, రూప్లతండ, జాటోత్ తండా, రామ్ల తండా, ఇమాంపేట గ్రామాల్లో కొనసాగిన ప్రచారం

అభిమాన నేతకు ఎదురెళ్లి మంగళహారతులతో స్వాగతం పలికిన ప్రజలు

జగదీష్ అన్నకు జై కొడుతున్న యువత , మహిళాలోకం

ప్రజల కోసం పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ కు  ఏనాడూ లేదని,
గ్రామాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యం అని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సూర్యాపేట నియోజకవర్గం లో  బీఆర్‌ఎస్‌ ప్రచారం హోరెత్తుతున్నది.  మూడవ సారి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు విరామం లేకుండా ఊరూరా.. వాడవాడలా కలియతిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. సోమవారం సూర్యాపేట రూరల్ మండలం కేసారం, కాసరబాద, తాళ్ల ఖమ్మం పహాడ్, రూప్లతండ, జాటోత్ తండా, రామ్ల తండా, ఇమాంపేట గ్రామాల్లో  విస్తృత ప్రచారం నిర్వహించారు . తమ గ్రామంలోకి వచ్చిన అభిమాన నేతకు పొలిమేర నుండే ఎదురెళ్లి మరీ మంగళ హారతులు, పూలవర్షం కురిపించి ప్రజలు అపూర్వ స్వాగతంపలికారు .. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ 
ఇప్పటికే  ఎన్నోసార్లు ఓటు వేసిన ప్రజలు ఎవరికి వేసిన ఓటుతో ఏమొచ్చిందో ఆలోచన చేయాలి అన్నారు.మనం వేసే ఓటే మన తలరాతను మారుస్తుంది..అన్నారు.2009లో వేసిన ఓటు  ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు కడుపునిండా కరెంటును  తీసుకువచ్చింది అన్నారు.ఊర్లలో కొట్లాటలు.. సూర్యాపేటలో దందాలే కాంగ్రెస్ నైజం అన్నారు..కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసుల తో నాయకులకు పోలీస్ స్టేషన్ పైరవీలు తప్పా అభివృద్ధి పై సోయే ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలలో ఒకరికో  ఇద్దరికో పెన్షన్లు వస్తే, పెన్షన్ రానివారు తీసుకుంటున్న వారి చావు కోసం ఎదురుచూసే దౌర్భాగ్యపు పరిస్థితులు ఉండేవన్నారు. 2014 తర్వాత ఒక్కో గ్రామం  లో సుమారుగా 500 మందికి తక్కువ కాకుండా పెన్షన్లు వస్తున్నాయని తెలిపారు. 2014లో కారు గుర్తుకు  వేసిన ఓటు రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి, స్వచ్ఛమైన త్రాగునీరు, వంటి ఎన్నో పథకాలుతీసుకువచ్చిందన్నారు. 2018 లో వేసిన ఓటు కూడా 8 వేల రైతుబంధును 10 వేలు, 1000 పెన్షన్  ను 2000, 50,000 ఉన్న కల్యాణ లక్ష్మి ను లక్ష రూపాయలుచేసిందన్నారు.
2014 తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో లబ్ధిదారులు ఏ పార్టీకీ చెందినవారు అనే విషయాన్ని చూడకుండా పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ పరిస్థితి ఉండదన్న విషయాన్నీ ప్రజలు గ్రహించాలని కోరారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిన గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
స్వయంపాలనలో తండాలు అభివృద్ధి చెందాయని అన్నారు.ఆరు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని, పదేళ్లలోనే చేసి చూపించానని అన్నారు. కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
దేశం ఆశ్చర్యపోయేలా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా అన్నారు.యువతకు ఉపాధి లక్ష్యంగా భవిష్యత్తు పాలన కొనసాగిస్తానన్న మంత్రి, పదివేల మంది యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వెయ్యకురాల్లో పారిశ్రామిక హక్కుని ఏర్పాటు చేస్తానని అన్నారు. దీంతోపాటు శాశ్వత ఐటి టవర్లను నిర్మించి 3000 మంది స్థానిక యువతి యువకులు తమ ఇళ్లలోనే ఉంటూ ఐటీ ఉద్యోగం చేసుకునే విధంగా ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని తెలిపారు. డ్రైపోర్టు తీసుకువచ్చి గ్రామాలలో ఉన్న నిరుపేదలకు దానిలో ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు వస్తాయన్న మంత్రి , నిరుపేద మహిళ కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు 3000, రైతు బీమా తరహాలో ప్రతి పేదవారికి ఐదు లక్షల రూపాయలతో కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇల్లు నిర్మాణం, ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ను 4000, దివ్యాంగుల పెన్షన్ 6000, రైతుబంధు 16 వేల రూపాయలు, మహిళా సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహాన్ని నెల 30 తారీఖు వరకు కొనసాగించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఓటు ఓటు వేసిన వారంతా గర్వపడేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.