కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి
రానున్న ఎన్నికల్లో గెలిపించండి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం
తెలంగాణవార్త, చిగురుమామిడి మండల ప్రతినిధి నవంబర్ 18:- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న 119 నియోజకవర్గాలలో మార్పు జరగాలి ప్రజలు గెలవాలని హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం చిగురుమామిడి మండలంలోని పీచుపల్లి సీతారాంపూర్ లంబాడిపల్లి గాగిరెడ్డిపల్లి ఇందుర్తి చిగురుమామిడి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలను ప్రజలు చూశారని ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మార్పు తీసుకువస్తామని ఈ మార్పుతో ప్రజలు గెలుస్తారని పొన్నం ప్రభాకర్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు తీరుపై విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిగురుమామిడి జడ్పిటిసి గీకురు రవీందర్ అఖిల పక్షం నాయకులు సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ సిపిఐ చిగురుమామిడి మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి కొయ్యడ సృజన్ కుమార్ సర్పంచులు గోలి బాపిరెడ్డి నాగేల్లి వకుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్ర లక్ష్మీ ప్రసన్నారెడ్డి మహిళా నాయకురాలు ఓరుగంటి భారతీదేవి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డివివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.