కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2023 తెలంగాణవార్త-ప్రతినిధి:- గద్వాల:-కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.అనంతపురం గ్రామానికి చెందిన పెద్ద పిలుపన్న కుమారుడు సందీప్ గురువారం ఉదయం ఇంటి ముందు ఉన్న కుక్క తో సరదాగా ఆటలాడుకుంటుండగా ఒక్కసారిగా బాలుడు పై దాడి చేసింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు సందీప్ ను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కర్నూల్ తరలించినట్లు తెలిపారు. అదే వీధిలో ఓ వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నట్లు సమాచారం.