ఒళ్లంతా గులాభీ మయం...

ఒంటికెక్కిన అభిమానం 

ఒళ్లంతా గులాభీ మయం...
ఒళ్లంతా గులాభీ మయం...

"జై జగదీషన్న" అంటూ  శరీరం పై పెయింటింగ్ తో నినాదం 

వినూత్న తరహా లో అభివృద్ధి ప్రదాతకు స్వాగతం పలికిన అభిమాని సందీప్

సూర్యాపేట రూరల్ మండలం కేసారంలో ఘటన.

ప్రతినిధి సూర్యాపేట

మంత్రి జగదీష్ రెడ్డి పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాడు సూర్యాపేట రూరల్ మండలం కేసారం గ్రామానికి చెందిన సందీప్ అనే అభిమాని. తాను అత్యంత ప్రేమించే  సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారం నిమిత్తం తమ గ్రామం కేసారానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సందీప్, అందరికంటే భిన్నంగా ఆహ్వానం పలకాలని ఉద్దేశంతో తన శరీరాన్ని పింక్ కలర్ గా మార్చుకొని గులాబీమయం చేశాడు. శరీరంపై నిట్టనిలువునా, జై జగదీష్ అన్న అంటూ పెయింట్ తో  నినాదం రాయించుకొని తన అభిమాన నేతకు స్వాగతం పలకడం అందరినీ ఆకట్టుకుంది. సందీప్ అభిమానానికి మంత్రముగ్ధులైన మంత్రి సందీప్ తో ఆప్యాయంగా మాట్లాడి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.