ఎన్నికలవేళ ప్రజా చైతన్యం మరింత వెల్లివిరియాలి

ఎన్నికలవేళ ప్రజా చైతన్యం మరింత వెల్లివిరియాలి

.మెరుగైన పాలన అందించాలి కానీ  పోటీపడి రాయితీలు ప్రకటించడం  ప్రజల హక్కులను కాలరాయడమే. విధానపరమైన ప్రకటనలకే  మేనిఫెస్టోలు పరిమితం కావాలి . యాచకులుగా మార్చే ప్రలోభాలను ఎన్నికల సంఘం  పూర్తిగా నిషేధించాలి.

 199o -95 మధ్యకాలంలో  ఎన్నికల ప్రధాన అధికారిగా టిఎన్ శె షన్ ఉన్న కాలంలో  ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకొని  ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేసిన కారణంగా  భారత ఎన్నికల  చరిత్రలో అతనికి  మంచి పేరు ఉన్నది . అవసరమైన చట్టాల కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడంతో పాటు ఉన్న చట్టాలను  సమగ్రంగా ఉపయోగించుకోవడం కూడా ఎన్నికల సంఘం నేర్చుకున్నప్పుడు  ఇలాంటి ఫలితాలను చవిచూడవచ్చు.  కానీ ప్రస్తుతం  గత రెండు దశాబ్దాలుగా ఎన్నికల నిర్వహణ చూసినప్పుడు  ఉప ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోను విచ్చలవిడి అవినీతి,  హద్దు మీరిన ప్రచారాలు,  మద్యం డబ్బు  పంపిణీతో  రాజకీయ పార్టీల  తీరు అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నది.  ప్రజలు స్వేచ్ఛాజీవులుగా, ప్రభువులు గా బ్రతకాలంటే  పాలకుల ప్రలోభాలకు  అడ్డుకట్ట వేసి  రాజ్యాంగబద్ధంగా హక్కులను సాధించుకునే  ఆత్మగౌరవ జీవితం ప్రజలకు సమకూర్చవలసిన అవసరం ఉన్నది.  ప్రజల ఆలోచనతో పాటు  ఎన్నికల సంఘం యొక్క పటిష్ట చర్యలు ఈ వైపుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.  జాతీయ స్థాయిలోనూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా  గమనించినప్పుడు  విధానపరమైన ప్రకటనలకు  అవకాశము లేని తాత్కాలిక ప్రయోజనాలతో ప్రజలను సంతృప్తి చేసే పర్వానికి తెరతీసున్న   కారణంగా ప్రజలు అభాసు పాలవుతున్నారు.  ఈ క్రమంలో చాలామంది పాలకులు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాలలో "ఎన్నికల్లో ప్రజలు గెలవాలి" అనే నినాదాన్ని ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు . కానీ" ప్రజలు గెలవాలంటే నిజాయితీగే లవాలి, అవినీతి ఓడిపోవాలి , అరాచకాలకు అకృత్యాలు అవినీతికి  చరమగీతం పాడి  ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు కృషి చేసినప్పుడు మాత్రమే  ప్రజలు గెలిచినట్లు లెక్క "అని పాలకులు గుర్తిస్తే మంచిది .
     విధాన ప్రకటనకు బదులుగా ప్రలోభాలా?:-
********
  కేంద్రమైన రాష్ట్రాలైనా  పరిపాలనకు సంబంధించిన విధాన ప్రకటన స్పష్టంగా చేయవలసి ఉంటుంది.  విధాన ప్రకటనల నుండి  వివిధ రకాల పథకాలను ప్రవేశ పెడుతూ  లక్ష సాధనలో పాలకవర్గాలు కృషి చేయవచ్చు.  అలాంటప్పుడు రాయితీల     ప్రలోభాల మోత ప్రజల ముందు  వినిపించకూడదు.  విస్తృత స్థాయిలో విధాన ప్రకటన చేయడానికి  బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తీసుకునే కఠిన నిర్ణయాలు , పంచవర్ష ప్రణాళికల సమయంలో  చోటు చేసుకునే ప్రాధాన్యత కూడా క్రియాశీల భూమిక పోషిస్తాయి. అదే క్రమంలో  ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకానికి  పెద్దపీట వేసి  అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే  పరిపాలన ప్రజల పక్షాన కొనసాగుతుంది., ప్రజలు ప్రభువులుగా మిగిలిపోతారు పాలకులు సేవకులుగా  ప్రజా సంపదకు కాపలాదారులుగా  మాత్రమే  కొనసాగవలసి ఉంటుంది.  కాని దానికి భిన్నంగా ఈనాడు పాలకులు  ప్రజల పైన స్వౌరా విహారం చేస్తూ,  ఎన్నికల్లో అనేక ప్రకటనలు రాయితీలు ప్రకటిస్తూ , ఎన్నికల సంఘం  విధించిన పరిమితికి భిన్నంగా కోటాను కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ  ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా  ఎన్నికల సంఘం చూస్తూ ఉండడాన్ని  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు  ఘాటుగా విమర్శిస్తున్నారు, ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం డిమాండ్ చేస్తున్నారు కూడా.
      వ్యవసాయ , పారిశ్రామిక ,  యువజన , విద్యా,  వైద్య ,  మహిళా ,  రైతు , శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల సక్రమ వినియోగం పైన ప్రకటించే విధానము,  ఆర్థిక విధానము  మొదలైనటువంటి రంగాలకు సంబంధించి  పరిపాలన యొక్క మౌలిక సూత్రాలను  విధాన పత్రంలో ప్రకటించినప్పుడు  ప్రజలకు భరోసా ఉంటుంది .కానీ  విధాన ప్రకటన లేకుండా కేవలం ఎన్నికల్లో ప్రచారం కోసమే ప్రలోభాలను ప్రకటించినప్పుడు  ప్రజలు రాయితీలకు మాత్రమే అలవాటు పడి తమ హక్కులను  తద్వారా బాధ్యతలను కూడా కోల్పోవడాన్ని మనం గమనించవచ్చు. ఉ చితాల లోగుట్టు తెలిసిన   ప్రభుత్వాలు  ప్రజలను యాచకులుగా మార్చితే  ఓటర్లు కూడా  సోమరిపోతులై ఉత్పత్తి క్రియలో భాగస్వాములు కాకుండా పనిచేయకుండానే ఉచితంగా బ్రతకవచ్చుననే  దుర్మార్గపు ఆలోచన బలపడుతున్న కారణంగా భారతదేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని  ఎంత తొందరగా  నిర్మూలిస్తే అంత మంచిది. ఇటీవల ప్రధానమంత్రి కూడా  ఒక దశలో ఉచితాలను వ్యతిరేకిస్తూ  ప్రకటన చేసినప్పటికీ బిజెపి మేనిఫెస్టోలలో కూడా అలాంటి రాయితీలు  ప్రకటించడాన్ని మనం గమనించవలసి ఉంటుంది . కాంగ్రెసు, బిజెపి, బారాస,  ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీఎంకే, అన్నా డీఎంకే, త్రు ణమూల్ కాంగ్రెస్,వైఎస్సార్సీపీ,tdp  వంటి జాతీయ  ప్రాంతీయ పార్టీలు సైతం  ఓటర్లను ప్ర సన్నుల చేసుకోవాలంటే గత్యంతరం లేని పరిస్థితులలో  ఉచిత రాయితీలకు అలవాటు పడుతున్న కారణంగా  ప్రభుత్వ విధానాలు పలుచబడిపోతున్నవి .ప్రజల జీవన ప్రమాణం కుంచించుకుపో తున్నది.
      ఈ పరిస్థితుల కారణంగా పేదరికం మరీ ఎక్కువై సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నది.
-  రాజ్యాంగం అమల్లో  పెట్టుబడిదారులు సంపన్న వర్గాలదే  రాజ్యం అవుతున్నది.
-  ప్రభుత్వము పెట్టుబడిదారుల ఉమ్మడి  కలయిక కారణంగా  పేదలు సామాన్యులు  యాచకులుగా  బలహీనులుగా మిగిలిపోతున్నారు.
--  హక్కులకై పోరాడలేని  స్థితికి నెట్టివేయబడుతున్నారు  తమ జీవితం ఇంతే అని సర్దుకోవాల్సి వస్తున్నది  .
    ఈ పరిస్థితుల నుండి కోట్లాది ప్రజానీకం బయట పడాలంటే  ఎన్నికల సమయంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించి    తమ అవసరాలను డిమాండ్ చేయాలి కానీ  ప్రాలో భాలకు తలవంచకుండా ఉండాలి.  విధానపరమైన అంశాలకు మాత్రమే మేనిఫెస్టోలను పరిమితం చేయాలి అంతకుమించి ప్రలోభాలతో కూడుకున్న  సుదీర్ఘ మేనిఫెస్టోలను విడుదల చేస్తే  ప్రజలు ఎక్కడికి అక్కడ తగలబెట్టి నిరసన వ్యక్తం చేయాలి  .చట్టపరంగా సంక్రమించేది హక్కు అయితే  ఎన్నికల ప్రకటన ద్వారా ప్రజలకు ఒరిగేది కేవలం బిక్ష మాత్రమే . అంబేద్కర్  అందించిన ఓటు హక్కు చైతన్యం ద్వారా  యజమానిగా మారుదామా ? యాచకులుగా మిగిలి పోదామా ?అనే చర్చను  ప్రజలు కొనసాగించకపోతే  రెండు సంవత్సరముల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఒంటి చేతి మీద రాసిన రాజ్యాంగానికి అర్థమే లేదు.
     ఇక ఎన్నికల సంఘం  ప్రజల డిమాండ్లను, ఎన్నికల ప్రచారంలో ప్రజాప్రతినిధులను అక్కడక్కడ నిలదీస్తున్న సందర్భాలను,  డబ్బు సరఫరా మద్యం పంపిణీ  చూస్తూ చూడనట్లు ఊరుకోకుండా  ఎంత స్థాయిలో ఉన్న వారిని అయినా  నేరస్తుల  గుర్తించి శిక్ష పడేలా చూడాలి  .విధానపరమైన ప్రకటనలకు తప్ప  రాయితీలు ఉచితలకు  ప్రాధాన్యతనిస్తూ ప్రకటించే మ్యానిఫెస్టోలను వెంటనే నిషేధించి  ఆ రాజకీయ పార్టీలను పోటీ నుండి  తప్పుకునేలా ఆదేశించగలగాలి  .భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే , ప్రజల హక్కులు  సజీవంగా ఉండాలంటే,  మరింత మెరుగైన వ్యవస్థ ఏర్పడాలంటే  ప్రజల చైతన్యం  ఉద్యమాలు పోరాటాలతోపాటు  ఎన్నికల సంఘం యొక్క చిత్తశుద్ధి కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.  ప్రజలు ఎక్కడికక్కడ  అవినీతిపరులు  డబ్బు పంపిణీ చేసేవాళ్లను తరిమికొట్టి  హక్కులను కాల రాసిన వాళ్లను  ఉక్కు పాదంతో అణచివేయగలగాలి  .ఇదంతా కేవలం ఉచితాలను అలవాటు చేసినటువంటి ప్రభుత్వాల ప్రలోభాల నుండి,  భ్రమల నుండి ప్రజలు బయట పడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది . దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో  బుద్ధి జీవులు మేధావి సంఘాలు వివిధ రూపాలలో ప్రజా చైతన్యం కోసం,  నిరుద్యోగ యాత్ర  చైతన్య కార్యక్రమాలు,  సభలు సమావేశాల పేరుతో  నిర్వహిస్తున్నది ప్రజలను పోరాటానికి  అవినీతిపై ఉద్యమానికి  సిద్ధం చేయడానికే నని  పాలకులు ,పార్టీలు గమనించాలి .


--  వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)