ఆర్థిక సాయం అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్
అడ్డగూడూరు, 09 నవంబర్ 2022 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపాడు గ్రామానికి చెందిన మన్నూరి శ్రీనివాస్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ 6000/- రూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటా అని మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు మార్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.