ఆకలితో ఉన్న పేదవాడికి అన్నంతో కడుపు నింపడం పుణ్య కార్యం

అన్నదానం మహాదానం

ఆకలితో ఉన్న పేదవాడికి అన్నంతో కడుపు నింపడం పుణ్య కార్యం
ఆకలితో ఉన్న పేదవాడికి అన్నంతో కడుపు నింపడం పుణ్య కార్యం

స్వర్ణ భారతి ట్రస్ట్ సామాజిక సేవలు అభినందనీయం, అన్నదానానికి స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం. సేవా కార్యక్రమాలతో విస్తరిస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ కు సహకారం అందిస్తా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, 28 జూలై 2022 తెలంగాణవార్త ప్రతినిధి:- అన్నదానం మహాదానం అని ఆకలితో ఉన్న పేదవారికి పట్టెడు అన్నం తో కడుపు నింపడం పుణ్య కార్యం అని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం లో భాగంగా నేడు 100వ అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తితో స్వర్ణ భారతి ట్రస్ట్ అనేక సేవా  కార్యక్రమాలు చేస్తూ నేడు కోదాడ పట్టణంలో ఆదర్శంగా  నిలుస్తుందన్నారు.

  సంపద ఉన్న సేవ చేయాలనే ఆకాంక్ష సమయం కొందరికి ఉండదని అటువంటి వారిలో సేవా భావాన్ని పెంపొందించి స్వర్ణ భారతి ట్రస్ట్ అండగా ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహి దస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన భారతదేశంలో ఆకలితో ఎవరూ అలమటించవద్దని, స్వర్ణ భారతి వంటి ట్రస్టులు పేదల ఆకలి తీరుస్తాయన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ట్రస్టు ఆవిర్భవించిందని ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళుతుందన్నారు. ప్రస్తుత సభ్యుల సహకారం దాతల సహకారం తో నేడు 100వ అన్నదానాన్ని నిర్వహించడం శుభ పరిణామం. విద్యా, వైద్య సామాజిక సేవ వృద్ధుల మహిళల పేద విద్యార్థుల వికలాంగుల ఇలా అన్నీ సంక్షేమ లకు ట్రస్టు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం..

  సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు రంగా,టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, పైడిమర్రి సత్య బాబు, రాయపూడి వెంకటనారాయణ,కౌన్సిలర్లు ఖదీర్,గుండెల సూర్యనారాయణ,మైస రమేష్, టిఆర్ఎస్ నాయకులు కుక్కడం బాబు, పైడిమర్రి నారాయణరావు, నరసింహారావు, రఘు, సాయి,టిఆర్ఎస్ నాయకులు, స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు యాదా సుధాకర్,, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.