అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కెసిఆర్ మళ్ళీ రావాలి

మునగాల 21 నవంబర్ 2023
తెలంగాణ వార్త ప్రతినిధి :-
మునగాల మండలం నరసింహుల గూడెం లో హత్య రాజకీయాలతో పబ్బం గడుపుకున్న నాయకులకు బుద్ధి చెప్పాలి
అనేక మందిని వాళ్ల రాజకీయ అవసరాల కోసం హత్య చేయించారు
3గంటల కరెంటన్న కాంగ్రెస్ను నమ్ముతారా...24గంటల కరెంటు ఇస్తున్న కెసిఆర్ కు ఓటేద్దామా.అభివృద్ధిని చూసి ఓటేయండి
కోదాడ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల మండలంలోని నరసింహులగూడెం, రేపాల, సీతానగరం, విజయరాఘవపురం, జగన్నాధపురం, కృష్ణానగర్, బరాకత్ గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి డప్పు చప్పులతో పూలు జల్లుతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు ఘన స్వాగతం పలికారు వాడవాడనా మహిళలు బొట్టు పెట్టి పెద్ద ఎత్తున ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ...గత పాలకులు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే నేను భుజాన ఎత్తుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాను...ఒక్క పంట కూడా నీళ్లు లేని ఈ ప్రాంతంలో కాలేశ్వరం ద్వారా నిలందించాం కరోనా కష్టకాలంలో తోడుగా లేనివారు నేడు మన అభివృద్ధికి ఏం సహకరిస్తారు,.మీ కష్టాల్లో నేనున్న, కరోనాలో నేనున్నా,మీకు ఆపద వచ్చిన ప్రతిసారి మీకు అండగా ఉన్న,నిరంతరం ప్రజల్లో ఉన్న ఆలోచించి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి చేస్తున్న నన్ను ఆశీర్వదించండి 2100కోట్ల అభివృద్ధి పనులు మీ కళ్ళముందు ఉన్నాయి,మీ గ్రామాలు తలతలా మెరుస్తున్నాయి ఎన్నికల అనంతరం మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు 3వేలు భృతి అందిస్తాం.400వందలకు గ్యాస్,ప్రతి ఒక్కరికి బీమా, సన్నబియ్యం,ఆరోగ్య శ్రీ ద్వారా 15లక్షల వరకు వైద్యం,ముసలవ్వలకు, వికలాంగులకు పెన్షన్ పెంపు ఇలా పేదలను ఆదుకునే విదంగా కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి మరింత సేవ చేస్తా,ఈ సందర్భంగా మాజీ మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ,ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన తెలంగాణలో అభివృద్ధి,సంక్షేమ పాలన నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మళ్ళీ పాత రోజులు వస్తాయి రైతులు నీళ్ల కోసం కరెంట్ కోసం గోస పడాలి ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చిన ఘనుడు కేసీఆర్, కోదాడ ఎమ్మెల్యే మల్లన్న గొప్పగా అభివృద్ధి చేసారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు బొల్లం మల్లన్న .
మరోమారు బొల్లం మల్లయ్య యాదవ్ ను ఆశీర్వదించండి అండగా ఉంటారు.ఈ సందర్భంగా వివిధ పార్టీలనుండి పలువురు బిఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజయ్ కుమార్, పచ్చిపాల వేణు యాదవ్, ఓయూ నేత కందుల మధు, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.