అభివృద్ధి పేరున అడవుల నరికివేత మానవాళి పురోగతికి తీవ్ర విఘాతం

ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం పాలకుల కనీస బాధ్యత.* ప్రజల చొరవ కూడా కాదనలేని సత్యం.
వివిధ కారణాలవల్ల విడుదలవుతున్న కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగిపోతూ విపరీత పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటే భయంకరమైన ఎండలు, వణికిస్తున్న తుఫానులు, కుండపోత వర్షాలు, అతి శీతల పవనాలు, అనేక ప్రకృతి బీభత్సాల కారణంగా భూమి తల్లడిల్లి పోతున్నది. ఇన్ని బాధల నుండి రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున అడవులను పెంచి తీరాల్సిన అవసరం ఉంది ఉన్న కీ కారన్యాలను కాపాడుకుంటూనే మరిన్ని అడవులను పరిరక్షించే క్రమంలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా ఉన్నది . రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ప్రజలకు పూచి ఇవ్వవలసినటువంటి కర్తవ్యం విస్మరించకుండా ఉండడం కనీస సామాజిక బాధ్యత. ఆడవుల యొక్క ప్రాధాన్యతను వర్ణించడానికి పేజీలు చాలవు అంటే అతిషయొక్తి కాదేమో! వాతావరణ మార్పులను, దుష్పరిణామాలను నివారించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించేవి అరణ్యాలే అని ప్రకృతి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు . శీతోష్ణ స్థితిగతులను క్రమబద్ధీకరించడంతోపాటు వర్షాభావ పరిస్థితుల నుండి ప్రకృతిని గట్టెక్కించడానికి తోడ్పడే కీలకమైన అడవులు ఎంతగా త రిగిపోతే అంతకు మించిన స్థాయిలో మానవాళి భవిష్యత్తు ప్రమాదపుటంచుకు చేరుకుంటుందనే నగ్న సత్యాన్ని ప్రజలు పాలకులు గుర్తించడం ఉమ్మడి బాధ్యత.
అడవులు తరిగిపోతున్న తీరు :-
**********
1952, 1980 కేంద్ర ప్రభుత్వ జాతీయ అటవీ విధానాల ప్రకారంగా ఏ దేశ భూభాగంలోనైనా ప్రజలు కష్టాలు కన్నీళ్ళకు గురి కాకుండా ఉండాలంటే 33 శాతం అడవులు ఉండాలని నిర్దేశించబడిన విషయం అందరికీ తెలుసు. కానీ 70 సంవత్సరాల తర్వాత కూడా అటవీ విధానాల మౌలిక లక్ష్యం నేటికీ నెరవేరకపోగా అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశ భౌగోళిక వైశాల్యంలో అడవులు 24.62 శాతం విస్తరించి ఉన్నట్టు తెలుస్తున్నది. 2016 తో పోలిస్తే ప్రస్తుతం అటవీ విస్తీర్ణం దాదాపుగా3 శాతం పెరిగినా ద ట్టమైన అరణ్యాలు మాత్రం నానాటికి హరించుకు పోతున్న విషయం ప్రమాదకరంగా మారినది . ద ట్టమైన అడ వులకు వెలుపల ఒక హెక్టార్ విస్తీర్ణంలో పచ్చదనం 10 శాతానికి పైబడితే దాన్ని కూడా అడవిగాలెక్కిస్తున్నారు. రబ్బరు కాఫీ వంటి తోటలు కూడా అరణ్యాల స్థానాన్ని ఆక్రమించడం సబబు కాదు. అభివృద్ధి పేరున , జాతీయ భద్రత, ప్రజల అవసరాల ముసుగులో కొన్నిచోట్ల అటవీ భూములలో ప్రాజెక్టులు చేపట్టి న ప్పుడు అడవుల నరికివేత తప్పకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితులలో నరికివేతకు కారణం అవుతున్నటువంటి సంబంధిత పెట్టుబడిదారుల నుండి నష్టపరిహారాన్ని వసూలు చేసి ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకాన్ని కొనసాగించాలన్న నిబంధన అమలు కాకపోవడంతో హరిత చట్టాలు ఉ ల్లంగించబడడంతోపాటు ప్రభుత్వాల యొక్క ఉదాసీనత కూడా రోజురోజుకు అడవుల శాతం తగ్గడానికి కారణం అవుతున్నది. 1950 తర్వాత దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూములను ఇతర కార్యకలాపాలకు వినియోగించిన కారణంగా ఆ అడవులు నరికివేతకు గురైన విషయం పాలకులకు తెలియదా! అంతేకాదు 2018 నుండి 2023 మధ్యకాలంలో 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని అరణ్యాలు వివిధ రకాల కారణాలతో కనుమరుగైనట్లు తెలుస్తుంటే ప్రభుత్వ మౌనాన్ని ఏ రకంగా చూడాలి? భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం తలపెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను, నిర్లిప్తతను, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించే శక్తులు ఉన్నప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతిని విధ్వంసం నుండి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టాలి:-
*********
గనుల తవ్వకం, ఆనకట్టల నిర్మాణం, పరిశ్రమలు, రహదారులు ,రైల్వేలు వంటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు విషయంలో ప్రభుత్వాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. 1980 ప్రాంతంలో రూపొందిన అటవీ పరిరక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా అమలు చేయకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరించడానికి కేంద్రం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ప్రభుత్వ తీరుపైన విస్మయము ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు అటవీ భూములను అటవీయేతర అవసరాలకు మళ్లించే అధికారం కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న చట్టం అమలు కాకుండా చూడాలని దేశ ప్రజానీకానికి పిలిపివ్వడం మన బాధ్యతను గుర్తింప చేయడం , పాలకుల లోపాన్ని ఎండగట్టడమే. జాతీయ భద్రతా ప్రాజెక్టుల కోసమని అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల లోపు భూములను అటవీ పరిరక్షణ చట్టం పరిధిలోంచి మినహాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది . వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో నిర్దేశిత విస్తీర్ణంలోని అటవీ భూములకు మినహాయింపు ఇవ్వాలనే ఆలోచన కేంద్రం చేస్తున్నట్లు కథనాలు. ఈ ఆలోచన నిజమై చట్టం సవరించబడితే తూర్పు పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాలకు మినహాయింపు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రైవేటు పెట్టుబడిదారుల ఆలోచనలు, ప్రభుత్వం శాంతిభద్రతలు ఇతర కారణాల పేరుతో ఇవ్వదలుచుకున్న మినహాయింపు రెండు కూడా పర్యావరణానికి పెను ప్రమాదం . అడవుల విస్తీర్ణం మరింత తగ్గడానికి ఆస్కారం ఉన్నటువంటి అటవీ పరిరక్షణ చట్టానికి మినహాయింపును వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని మేధావులు పర్యావరణవేత్తలు కేంద్రాన్ని డిమాండ్ చేయడం ఆలోచించదగినది . అదే సమయంలో ప్రజలు ప్రజాస్వామిక వాదులు అడవుల పరిరక్షణలో చెట్ల పెంపకంలో హరిత పరిరక్షణలో తమ వంతు బాధ్యతను కూడా పోషించడం సామాజిక ధర్మంగా భావించినప్పుడు ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రస్థాయిలో తిప్పి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది . కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఉదాసీన వైఖరిని ఖండిద్దాం !పౌర సమాజం బాధ్యతగా అటవీ పరిరక్షణలో తోచిన రీతిలో పాల్గొందాం.!
-- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)