అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి.

అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి.
అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి.

ఖమ్మం : నగర నడిబొడ్డున అంబేడ్కర్ సెంటర్ లో గల అంబేడ్కర్ విగ్రహాన్ని ద్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని యూనిటీ ఆఫ్ మాల ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ‌, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిందితునిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని, దేశద్రోహ చర్యగా భావించి కఠినంగా శిక్షించాలని అధ్యక్షుడు కందుల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు బందెల నాగలక్ష్మి, భవాని, చిలకబత్తిని కనకయ్య, నల్లపు రమేష్, జంగం లక్ష్మీనారాయణ, చింతల రవి, శ్రీకాంత్ తదితర యూనిటీ ఆఫ్ మాల సభ్యులు కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని నాయకులు హెచ్చరించారు.