అన్నయ్య తప్ప.. ఈ పాత్రని ఇంకెవ్వరూ చేయలేరు 

అన్నయ్య తప్ప.. ఈ పాత్రని ఇంకెవ్వరూ చేయలేరు 

అభిమానులే మా ఆస్తిపాస్తులు. వాళ్ల ఆనందం కోసమే సినిమాలు చేస్తుంటాం’’ అన్నారు ఎన్టీఆర్‌. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘రెండున్నరేళ్ల క్రితం కల్యాణ్‌ అన్న ఫోన్‌ చేసి ‘చాలా ఆసక్తికరమైన కథ విన్నా. నువ్వు  కూడా వింటే బాగుంటుంది అని చెప్పాడు. అలా ‘బింబిసార’ కథ నేను విన్నాను. ఎంత కసిగా ఆ కథ చెప్పాడో.. అంతకంటే గొప్పగా వశిష్ట ‘బింబిసార’ మలిచాడు. కల్యాణ్‌ అన్న కెరీర్‌ ‘బింబిసార’కి ముందు. తరవాత అనుకోవాల్సిందే. ఈ సినిమాకు కల్యాణ్‌ రామ్‌ రక్తం ధారబోశాడు. ఆయన తప్ప.. ఈ పాత్రకు న్యాయం చేయగల నటుడు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘పాతాళ భైరవి, భైరవ ద్వీపం, జగదేకవీరుడు - అతిలోక సుందరి లాంటి మంచి సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడమే మా పయ్రత్నం. ఈసారి ఎవరినీ నిరుత్సాహ పరచను. 200 శాతం అభిమానులంతా గర్వంగా భావిస్తార’’న్నారు...!!